Rapido: దిగొచ్చిన రాపిడో.. యాడ్ నుండి ఆ క్లిప్ తొలగింపు..

X
Rapido (tv5news.in)
By - Divya Reddy |13 Nov 2021 4:00 PM IST
Rapido: టీవీ ప్రకటన వివాదంపై ర్యాపిడో దిగివచ్చింది. TSRTC బస్సులను చూపించిన క్లిప్ ను యాడ్ నుంచి తొలగించింది.
Rapido: టీవీ ప్రకటన వివాదంపై ర్యాపిడో దిగివచ్చింది. TSRTC బస్సులను చూపించిన క్లిప్ ను యాడ్ నుంచి తొలగించింది. ఈ యాడ్ లో అల్లు అర్జున్ నటించారు. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా యాడ్ ఉందని ఆర్టీసీ యండీ సజ్జనార్ ర్యాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమర్షియల్ యాడ్స్ లో నటించేప్పుడు యాక్టర్స్ జాగ్రత్తగా చూసి నటించాలని కోరారు. ఈ నేపథ్యంలో ర్యాపిడో తన యాడ్ లో మార్పులు చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com