RATION CARDS: కొత్త రేషన్‌కార్డుల జారీపై కీలక ప్రకటన

RATION CARDS: కొత్త రేషన్‌కార్డుల జారీపై కీలక ప్రకటన
X
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై అప్డేట్... నిరంతరాయంగా కార్డుల జారీ ప్రక్రియ

సంక్షేమ పథకాల తలుపులు తెరుచుకునే ‘కీ’గా మారిన రేషన్ కార్డుల జారీకి తెలంగాణలో మళ్లీ వేగం వచ్చింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమైన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ తాజాగా స్పష్టం చేసింది. గతంలో ఏళ్ల తరబడి కొత్త కార్డులు జారీ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది కుటుంబాలకు ఇప్పుడు ఊరట లభిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘ప్రజా పాలన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. పరిశీలన అనంతరం కొత్త కార్డులను జారీ చేయడం ప్రారంభించింది.

తా­జా­గా పౌ­ర­స­ర­ఫ­రాల శాఖ అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చిన వి­వ­రాల ప్ర­కా­రం, కొ­త్త రే­ష­న్ కా­ర్డుల జారీ ప్ర­క్రియ కొ­న­సా­గు­తూ­నే ఉం­ద­ని తె­లి­పా­రు. ఇంకా కా­ర్డు­లు పొం­ద­ని అర్హు­లు మీ సేవ కేం­ద్రాల ద్వా­రా దర­ఖా­స్తు చే­సు­కో­వ­చ్చ­ని సూ­చిం­చా­రు. పాత కా­ర్డు­ల్లో కు­టుంబ సభ్యుల పే­ర్లు జో­డిం­చా­ల్సిన అవ­స­రం ఉన్న­వా­రి­కి కూడా సదు­పా­యం అం­దు­బా­టు­లో ఉం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. పే­ర్ల చే­ర్పు, కు­టుంబ వి­భ­జన, చి­రు­నా­మా మా­ర్పు­లు వంటి అం­శా­లు ని­రం­తర ప్ర­క్రి­య­గా కొ­న­సా­గు­తు­న్నా­య­ని వె­ల్ల­డిం­చా­రు. ఇంకా దరఖాస్తు చేయని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కొ­త్త రే­ష­న్‌ కా­ర్డుల జారీ ప్ర­క్రియ ని­రం­త­రా­యం­గా కొ­న­సా­గు­తుం­ది చె­ప్పా­రు. ఇంకా కా­ర్డు­లు రాని వారు మీ సేవ కేం­ద్రా­ల్లో అప్ల­య్ చే­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. దాం­తో పా­టు­గా.. పాత కా­ర్డు­ల్లో కు­టుంబ సభ్యుల పే­ర్ల­ను జో­డిం­చే ప్ర­క్రియ సైతం ని­రం­త­రా­యం­గా కొ­న­సా­గు­తోం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. ఇక రా­ష్ట్రం­లో రే­ష­న్‌ కా­ర్డు­లు, లబ్ధి­దా­రుల సం­ఖ్య భా­రీ­గా పె­రి­గిం­ద­ని అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. 2026 జన­వ­రి నా­టి­కి రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా మొ­త్తం రే­ష­న్‌­కా­ర్డుల సం­ఖ్య 1,04,35,848కు చే­రిం­ద­ని తె­లి­పా­రు. లబ్ధి­దా­రుల సం­ఖ్య 3,35,96,875కు పె­రి­గి­న­ట్లు సి­వి­ల్ సప్ల­య్ శాఖ అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. గడి­చిన ఏడా­ది­లో­నే ఏకం­గా 14.40 లక్షల కొ­త్త రే­ష­న్ కా­ర్డు­లు మం­జూ­రు చే­సి­న­ట్లు తె­లి­పా­రు. 2025 జన­వ­రి 1 నా­టి­కి రా­ష్ట్రం­లో మొ­త్తం రే­ష­న్‌ కా­ర్డుల సం­ఖ్య 89,95,282 ఉం­ద­ని చె­ప్పా­రు. ఇం­దు­లో నే­ష­న­ల్‌ ఫు­డ్‌ సె­క్యూ­రి­టీ కా­ర్డు­లు(NFSC) 54,66,844. ఫు­డ్‌ సె­క్యూ­రి­టీ కా­ర్డుల(SFSC) సం­ఖ్య 35,28,438గా ఉం­ద­న్నా­రు. ప్ర­భు­త్వం 14,40,566 కొ­త్త కా­ర్డు­ల­ను తె­లం­గాణ ప్ర­భు­త్వం మం­జూ­రు చే­సిం­ద­న్నా­రు.

Tags

Next Story