RATIONCARDS: కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ

RATIONCARDS: కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ
X
అధికారుల సమాయత్తం... డిజైన్ల తుది పరిశీలన

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో లేని జిల్లాల్లో మొదట పంపిణీ ప్రారంభించి.. కోడ్‌ ముగిశాక మిగిలిన జిల్లాల్లోనూ చేపట్టాలన్నారు. తెలంగాణ పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశమిచ్చినా, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్‌ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటోందని సీఎం ప్రశ్నించారు. దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తుండడమే దీనికి కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, వేగంగా జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కొత్త కార్డులకు జారీకి పలు డిజైన్లను పరిశీలించారు.

కోడ్ ఉన్న జిల్లాల్లో అప్పటినుంచే

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంది. మార్చి మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ఫోకస్ చేయనుంది. మార్చి చివర్లో రేషన్ కార్డుల జారీ ఉండొచ్చు.

Tags

Next Story