TS DGP: డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు

తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు వెళ్లిన మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు సంజయ్ కుమార్, మహేష్ భగవత్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఈ యాక్షన్ తీసుకుంది ఈసీ. అర్హత ఉన్న పోలీస్ అధికారిని తదుపరి డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా పేరుని ప్రకటించింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతోపాటు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు. ఆయన 1990వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడంతో జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి పలువురు అధికారులు తరలివెళ్లారు. డీజీపీ అంజనీకుమార్,.. సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన్ను మద్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీ అంజనీకుమార్‌పై...... సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా... పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపినందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద సస్పెన్షన్ వేటు పడింది. డీజీపీ అంజనీకుమార్‌తో పాటు వెళ్లిన అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్‌కి కేంద్రఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఇద్దరు అధికారులకు ఈసీ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story