North Hyderabad: మాదాపూర్ తరహాలో మరో ఐటీ హబ్.. హాట్ కేకుల్లా ప్లాట్లు..

North Hyderabad: ఇప్పటికే అభివృద్ది చెందిన నగరం హైదరాబాద్.. గ్రేటర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యి స్థిరాస్థి కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నాయి.ఐటీ రాకతో 2007లో మాదాపూర్ చుట్టుపక్కల 20 కి.మీ మేర విస్తరించింది.
ఇదే తరహాలో ఉత్తర హైదరాబాద్ కండ్లకోయలో ఐటీ సంస్థలు తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతం భవిష్యత్తులో మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అవుతుందనడంలో ఆశ్చర్యం లేదంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. ఇక ఈ ప్రాంతం నుంచి కనెక్టివిటీ కూడా బావుంది.
ఎన్‌హెచ్ 44, ఓఆర్ఆర్, రైల్వే, ఎంఎంటీఎస్ సౌకర్యం ఉండడం, స్థలాల ధరలు కూడా పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ చౌకగా ఉండడం ఈ ప్రాంతానికి అదనపు బలాలు చేకూరుస్తున్నాయి.
ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్డప్ ఏరియాలో ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు మంత్రి పత్రాలను కూడా జారీ చేశారు.
భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50వేల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో స్థిరాస్థి జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం చేపడుతున్నారు.
ప్రధానంగా జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో స్థిరాస్థి వ్యాపారం జోరందుకుంది. చుట్టు పక్కల జిల్లా వాసులు హైదరాబాదులో భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మేడ్చల్ జాతీయ రహదారిలో పెద్ధఎత్తున ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com