Telangana : తెలంగాణలో మెరిసిన తెల్లబంగారం ... రికార్డు స్థాయి ధర
తెలంగాణలో తెల్లబంగారం మెరిసింది. దిగుబడులు తగ్గడం , జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో పత్తికి రికార్డు ధర పలికింది.

తెలంగాణలో తెల్లబంగారం మెరిసింది. దిగుబడులు తగ్గడం , జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో పత్తికి రికార్డు ధర పలికింది. ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధర పలికింది. మరోవైపు పెరిగిన ధరలు కొంత ఊరట ఇస్తున్నా.. ఈఏడాది వాతావరణ మార్పులతో పత్తి దిగుబడి తగ్గిందంటున్నారు రైతులు. పెరిగిన కూలీ రేట్లు.. పెట్టుబడులు చూసుకుంటే ధర తమకేమి గిట్టుబాటు కాదనీ అన్నదాతలు అంటున్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి పంటకు రికార్టు స్థాయిలో ధర పలికింది. క్వింటా పత్తి 9వేల 100 రూపాయలకు అమ్ముడైంది. మార్కెట్‌కు 4 వేల 829 బస్తాలు విక్రయానికి వచ్చాయి. ఈనెల 27 న క్వింటా 8 వేలు ఉన్న పత్తి.. ఆతర్వాత ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాకు 6 వేల 25 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించింది.ఇప్పుడు దానికంటే 3 వేలు అధికంగా రావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లబంగారానికి పేరుగాంచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ పత్తి 8 వేల 8 వందల 5 రూపాయలుగా పలికింది. గత సంవత్సరం 5 వేల 8 వందల 50 రూపాయలు మాత్రమే ఉన్న క్వింటాల్ పత్తి ధర.. ఈసారి మూడు వేల రూపాలయలు అధికంగా పలకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఈఏడాది వాతావరణ మార్పులతో పత్తి దిగుబడి ఎకరాలకు 2 నుంచి 3 క్వింటాళ్ల మేర తగ్గిందన్నారు.
RELATED STORIES
Chaitra Hallikeri: భర్త వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ...
24 May 2022 1:50 PM GMTOscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMT