రెడ్ స్టోన్ @ తెలంగాణ సెక్రటేరియట్

రెడ్ స్టోన్ @ తెలంగాణ సెక్రటేరియట్
తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో రెడ్‌ స్టోన్‌

తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో రెడ్‌ స్టోన్‌ను వినియోగించనున్నారా? ఢిల్లీ వెళ్లిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం.. పార్లమెంట్ భవనానికి వాడిన రెడ్ స్టోన్‌ను పరిశీలించింది. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఉపయోగించిన రెడ్ శాండ్ స్టోన్ నిర్మాణాలను... ఫౌంటైన్‌ డిజైన్‌ను కూడా పరిశీలించారు. మంత్రితో పాటు.. ఆర్‌ అండ్‌ బి ఉన్నతాధికారులు.. ఆర్కిటెక్ట్‌ ఆస్కార్‌.. షాపూర్‌జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్‌ తదితరలు ఉన్నారు. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు రెడ్ స్టోన్‌ ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించారు.

Tags

Next Story