Republic Day: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

రాజ్‌భవన్‌లో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై జాతీయ జెండా ఎగురవేశారు. గవర్నర్ మాట్లాడుతూ.. కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదంటూ కేసీఆర్ సర్కార్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫామ్‌హౌస్‌లు కట్టుకోవడం అభివృద్ధి కాదన్నారు. తనది నిజాయితీగా కష్టపడే మనస్తత్వమని.. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చన్నారు. అందువల్ల తనను దూరం పెట్టొచ్చని తెలిపారు.మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సదుపాయాలు ఉండాలని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి, పథకాల అమలు కోసం ప్రభుత్వాన్ని గైడ్ చేయడం తన బాధ్యతని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలంగాణతో నా బంధం మూడేళ్లుగా కాదు.. పుట్టుకతోనే ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని, హక్కులను కాపాడుకుందామని స్పష్టం చేశారు. రాజ్‌భవన్ లో జరిగిన వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com