Republic Day : ప్రగతి భవన్ లో గణతంత్ర వేడుకలు

Republic Day : ప్రగతి భవన్ లో గణతంత్ర వేడుకలు
రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్

ప్రగతి భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. స్వతంత్రాన్ని అందించిన మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.


అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్ది, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,నవీన్ రావు, శంబు సీఎస్ శాంత కుమారి, డీజీపీ అంజనీ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

Next Story