REVANTH: రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నించింది

పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా? అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ( ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ‘‘అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించం. మెజారిటీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణచివేస్తామంటే కుదరదు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయమిది. ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని భాజపా నేతలు ప్రచారం చేశారు. అన్ని సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేసేవారు. తద్వారా పేదల హక్కులను కాలరాయాలని చూశారు. కార్పొరేట్లకు దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేశారు. ప్రజలను కాంగ్రెస్ అప్రమత్తం చేయడంతో భాజపా 240 సీట్ల వద్ద ఆగిపోయింది. దీంతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడింది. ఓట్లను తొలగించేందుకు ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది’’ అని రేవంత్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు జిల్లాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 3న మహబూబ్నగర్లో సీఎం రేవంత్ తొలి బహిరంగ సభ జరగనుంది.
మోడీని వదిలేది లేదు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉపాధి హామీతో ఎన్నో విప్లవాత్మక మార్పులొచ్చాయని కానీ అధికారం ఉందని మోడీ సర్కార్ ఇష్టారీతిన వ్యవహరిస్తోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుదామని బీజేపీ ప్రణాళికలు చేసింది. కానీ ఆశించినన్ని స్థానాలు రాకపోవడంతో రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. దీంతో వేరే రూపంలో ప్రజల హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ దేశంలో ఇళ్లు, ఆస్తి లేని వారికి ఓటు హక్కు ఒక్కటే ఆయుధం అని ఈ హక్కును తొలగాలనే ఎస్ఐఆర్ తీసుకువచ్చారన్నారు. ఓటు హక్కు తీసేస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు. చివరకు ఈ దేశంలో ఉండాలా లేదా అనే నిర్ణయం బీజేపీ చేతిలోకి వెళ్తుందన్నారు. ఈ దేశంలో వెట్టిచాకిరిని తిరిగి తీసుకువచ్చేందుకు బీజేపీ ఎస్ఐఆర్ ద్వారా ప్రయత్నిస్తోందన్నారు. అదానీ, అంబానీలకు తక్కువ ధరకు కూలీలు దొరకడం లేదని ఉపాధి పథకాన్ని మారుస్తున్నారు. ఇది కార్పొరేట్ కంపెనీల కుట్ర అని దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

