REVANTH: బీజేపీ-బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం

REVANTH: బీజేపీ-బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం
X
పరిగి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్... రెండేళ్ల ప్రజాపాలనలో అభివృద్ధి చేశామన్న రేవంత్... కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్-బీజేపీ కుట్ర... మోదీని చూసి ఓటేయాలా అని రేవంత్ రెడ్డి ప్రశ్న

పదే­ళ్ల పాటు అధి­కా­రం­లో ఉన్న బీ­ఆ­ర్‌­ఎ­స్‌ ప్ర­భు­త్వం ఉమ్మ­డి రం­గా­రె­డ్డి జి­ల్లా అభి­వృ­ద్ధి­ని పూ­ర్తి­గా వి­స్మ­రిం­చిం­ద­ని తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి ఎను­ముల రే­వం­త్ రె­డ్డి తీ­వ్రం­గా వి­మ­ర్శిం­చా­రు. మాజీ ము­ఖ్య­మం­త్రి కె. చం­ద్ర­శే­ఖ­ర్ రావు ని­ర్ల­క్ష్య పా­ల­న­కు ఇది ప్ర­త్య­క్ష ని­ద­ర్శ­న­మ­ని ఆయన వ్యా­ఖ్యా­నిం­చా­రు. శని­వా­రం వి­కా­రా­బా­ద్‌ జి­ల్లా పరి­గి మం­డ­లం నా­రా­య­ణ­పూ­ర్‌ గ్రామ శి­వా­రు­లో ని­ర్వ­హిం­చిన ‘ప్ర­జా­పా­లన – ప్ర­గ­తి బాట’ బహి­రంగ సభలో ము­ఖ్య­మం­త్రి ము­ఖ్య అతి­థి­గా పా­ల్గొ­ని ప్ర­సం­గిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం రే­వం­త్‌­రె­డ్డి మా­ట్లా­డు­తూ, గత పా­ల­కుల తప్పి­దాల కా­ర­ణం­గా తె­లం­గాణ రా­ష్ట్రం అప్పుల ఊబి­లో కూ­రు­కు­పో­యిం­ద­ని, అయి­న­ప్ప­టి­కీ ప్ర­జల సం­క్షే­మం, అభి­వృ­ద్ధి లక్ష్యం­గా కాం­గ్రె­స్‌ ప్ర­భు­త్వం బా­ధ్య­తా­యు­తం­గా ముం­దు­కు సా­గు­తోం­ద­ని తె­లి­పా­రు. ‘‘కే­సీ­ఆ­ర్‌ పాలన వల్ల ఆర్థి­కం­గా నష్ట­పో­యిన రా­ష్ట్రా­న్ని క్ర­మం­గా గా­డి­లో పె­ట్టే ప్ర­య­త్నం చే­స్తు­న్నాం. అప్పు­లు ఉన్నా ప్ర­జ­ల­కు ఇచ్చిన హా­మీ­ల­ను ఒక్కొ­క్క­టి­గా అమలు చే­స్తు­న్నాం’’ అని పే­ర్కొ­న్నా­రు.

పేదవాడికి అన్నం పెట్టాలనే...

ప్ర­భు­త్వం ఏర్పా­టైన వెం­ట­నే పే­ద­లు, మధ్య­త­ర­గ­తి ప్ర­జల అవ­స­రా­ల­ను గు­ర్తిం­చి కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­మ­ని సీఎం వి­వ­రిం­చా­రు. మూడు పూ­ట­లా కడు­పు­నిం­డా భో­జ­నం చేసే హక్కు ప్ర­తి పే­ద­వా­డి­కీ ఉం­డా­ల­నే ఉద్దే­శం­తో రే­ష­న్‌ కా­ర్డు వ్య­వ­స్థ­కు ప్రా­ధా­న్యం ఇచ్చా­మ­ని చె­ప్పా­రు. అలా­గే స్థా­ని­కం­గా ప్ర­జల ఇబ్బం­దు­లు తె­లు­సు­కొ­ని, సమ­స్యల పరి­ష్కా­రా­ని­కి ప్ర­ణా­ళి­కా­బ­ద్ధం­గా ముం­దు­కు వె­ళ్తు­న్నా­మ­ని అన్నా­రు. కళ్యాణ లక్ష్మి, షాదీ ము­బా­ర­క్‌, ఉచిత బస్సు ప్ర­యాణ సౌ­క­ర్యం, ఇం­ది­ర­మ్మ ఇళ్లు వంటి సం­క్షేమ పథ­కా­లు ప్ర­జ­ల్లో వి­శేష ఆదరణ పొం­దా­య­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. ఈ పథ­కాల ప్ర­భా­వ­మే ఇటీ­వల జరి­గిన స్థా­నిక సర్పం­చ్‌ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ­కి ప్ర­జ­లు ఘన వి­జ­యం అం­దిం­చా­ర­ని చె­ప్పా­రు. ప్ర­జల మద్ద­తే ప్ర­భు­త్వా­ని­కి బలం అని, అదే వి­ధం­గా ముం­దు­కు సా­గేం­దు­కు ప్రే­ర­ణ­గా మా­రిం­ద­న్నా­రు. ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­లు సమీ­పి­స్తు­న్న తరు­ణం­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌, బీ­జే­పీ పా­ర్టీల అభ్య­ర్థు­లు మళ్లీ రం­గం­లో­కి ది­గు­తు­న్నా­ర­ని సీఎం వి­మ­ర్శిం­చా­రు. ‘‘ఎన్ని­కల సమ­యం­లో మా­త్ర­మే ప్ర­జల ముం­దు కని­పిం­చే పా­ర్టీ­లు, ప్ర­జా సమ­స్య­ల­పై ని­జ­మైన శ్ర­ద్ధ చూ­ప­డం లేదు. అభి­వృ­ద్ధి, సం­క్షే­మం అనే అం­శా­ల­ను కేం­ద్రం­గా చే­సు­కొ­ని పని చే­స్తు­న్న కాం­గ్రె­స్‌ పా­ర్టీ అభ్య­ర్థు­ల­ను గె­లి­పి­స్తే ము­న్సి­పా­లి­టీ­ల్లో మరింత వే­గం­గా అభి­వృ­ద్ధి జరు­గు­తుం­ది’’ అని పి­లు­పు­ని­చ్చా­రు.

వి­కా­రా­బా­ద్‌ జి­ల్లా వ్యా­ప్తం­గా ఉన్న అన్ని ము­న్సి­పా­లి­టీ­ల్లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ మద్ద­తు ఉన్న అభ్య­ర్థు­ల­ను భారీ మె­జా­రి­టీ­ల­తో గె­లి­పిం­చా­ల­ని సీఎం ప్ర­జ­ల­ను కో­రా­రు. అలా జరి­గి­తే జి­ల్లా అభి­వృ­ద్ధి­కి అవ­స­ర­మైన ని­ధు­లు మరిం­త­గా కే­టా­యి­స్తా­న­ని హామీ ఇచ్చా­రు. స్థా­నిక సమ­స్యల పరి­ష్కా­రా­ని­కి ప్ర­భు­త్వ సహ­కా­రం పూ­ర్తి స్థా­యి­లో ఉం­టుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. వి­కా­రా­బా­ద్‌ జి­ల్లా అభి­వృ­ద్ధి వి­ష­యా­ని­కి వస్తే, పరి­గి ఎమ్మె­ల్యే టి. రా­మ్మో­హ­న్‌­రె­డ్డి ప్ర­త్యేక చొ­ర­వ­తో కీలక రహ­దా­రి ప్రా­జె­క్టు­లు ముం­దు­కు సా­గు­తు­న్నా­య­ని సీఎం వి­వ­రిం­చా­రు. అప్ప జం­క్ష­న్‌ నుం­చి మన్నె­గూడ వరకు నా­లు­గు లై­న్ల రహ­దా­రి ని­ర్మా­ణం, పరి­గి–వి­కా­రా­బా­ద్‌, పరి­గి–షా­ద్‌­న­గ­ర్‌ ప్ర­ధాన రహ­దా­రుల అభి­వృ­ద్ధి పను­లు శర­వే­గం­గా కొ­న­సా­గు­తు­న్నా­య­ని చె­ప్పా­రు. ఈ రహ­దా­రు­లు పూ­ర్త­యి­తే ప్రాంత ప్ర­జల జీవన ప్ర­మా­ణా­లు మరింత మె­రు­గు­ప­డ­తా­య­ని అభి­ప్రా­య­ప­డ్డా­రు.

మాది ప్రజా పాలన

రెం­డే­ళ్ల ప్ర­జా­పా­ల­న­లో సం­క్షే­మం, అభి­వృ­ద్ధి­ని సమాం­త­రం­గా కొ­న­సా­గి­స్తు­న్నా­మ­ని సీఎం స్ప­ష్టం చే­శా­రు. ‘‘గత ప్ర­భు­త్వా­లు చే­సిన తప్పు­ల­ను సరి­ది­ద్దు­తూ ప్ర­జల పా­ల­న­ను బలో­పే­తం చే­స్తు­న్నాం. ఆర్థిక ఇబ్బం­దు­లు ఉన్న­ప్ప­టి­కీ సం­క్షేమ పథ­కా­ల­ను ఆప­లే­దు’’ అని అన్నా­రు. అయి­తే ఎన్ని­కల సమ­యం­లో ప్ర­జా­స్వా­మ్య పో­రా­టం చే­యా­ల్సిన బదు­లు, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ – బీ­జే­పీ పా­ర్టీల మధ్య రహ­స్య ఒప్పం­దా­లు జరు­గు­తు­న్నా­య­ని ఆరో­పిం­చా­రు.

Tags

Next Story