REVANTH: లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గవర్నర్‌కు ఆయన సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వయంగా ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి పూలగుచ్ఛాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం కుటుంబం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలకగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

