REVANTH: తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు "ఈగల్"

ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3, 4 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుంది. రూ.1303.85 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనుంది. ఎల్ 1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ వైపు చూస్తే వారి వెన్ను విరుస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే స్పష్టంగా చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాదక ద్రవ్యాలు తరలించే వారు తెలంగాణ సరిహద్దులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకునేలా చర్యలు ఉండాలని మంత్రివర్గ సహచరులు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.
పంజాబ్‌లా అవ్వకూడదు
యుద్ధం, సైనికులు అంటేనే.. పంజాబ్ గుర్తుకు వచ్చేదని.. అలాంటి పంజాబ్ ఇవాళ డ్రగ్స్ మహమ్మారి వలలో చిక్కుకుందని రేవంత్ గుర్తు చేశారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. యువతను సరైన మార్గంలో పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణపతకం రాకపోవటం గురించి ఆలోచించామని,,. యువతకు సాంకేతిక నైపుణ్యం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.
ఈగల్ లోగో ఆవిష్కరించిన సీఎం
ొవిద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. పిల్లల ప్రవర్తనను గమనించేందుకు ప్రత్యేకమైన సిబ్బందిని నియమించుకోవాలని, విద్యాసంస్థల్లో బిహేవియర్ అబ్జర్వర్స్ను నియమించుకోవాలని తెలిపారు. గంజాయి అమ్మేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డ్రగ్స్ నివారణకు ప్రత్యేకంగా 'ఈగల్' అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని, గంజాయి పంట, సరఫరా, విక్రయంపై 'ఈగల్' టీమ్ నిఘా పెడుతుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com