REVANTH: మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోవద్దు: సీఎం రేవంత్

REVANTH: మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోవద్దు: సీఎం రేవంత్
X
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు

మొం­థా తు­పా­ను నే­ప­థ్యం­లో ధా­న్యం, పత్తి, మొ­క్క­జొ­న్న కొ­ను­గో­ళ్ల­లో అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి ఆదే­శిం­చా­రు. రై­తు­ల­కు నష్టం జర­గ­కుం­డా.. ఎలాం­టి ఇబ్బం­ది లే­కుం­డా కొ­ను­గో­ళ్లు జరి­గే­లా అన్ని చర్య­లు చే­ప­ట్టా­ల­ని అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు.పంట ఉత్ప­త్తు­లు కొ­ను­గో­లు కేం­ద్రా­ల­కు వస్తు­న్నం­దున వా­టి­పై ప్ర­త్యేక దృ­ష్టి కేం­ద్రీ­క­రిం­చా­ల­ని, రై­తు­ల­కు అన్ని­వి­ధా­లా సహ­క­రిం­చా­ల­న్నా­రు. జి­ల్లా కలె­క్ట­ర్లు, సం­బం­ధిత ఉన్న­తా­ధి­కా­రు­ల­కు స్ప­ష్ట­మైన ఆదే­శా­లి­వ్వా­ల­ని మం­త్రు­లు ఉత్త­మ్, తు­మ్మ­ల­కు చె­ప్పా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా ఉరు­ము­లు, మె­రు­పు­ల­తో కూ­డిన వా­న­లు కు­ర­వ­డం­తో పాటు ఈదు­రు గా­లు­లు వీ­స్తా­య­ని చె­ప్పిం­ది. మం­గ­ళ­వా­రం పె­ద్ద­ప­ల్లి, జయ­శం­క­ర్‌ భూ­పా­ల­ప­ల్లి, ము­లు­గు జి­ల్లా­ల­కు ఆరెం­జ్‌ హె­చ్చ­రి­క­లు జారీ చే­సిం­ది. బు­ధ­వా­రం ఈ జి­ల్లా­ల­తో పాటు ఆది­లా­బా­ద్, కు­ము­రం భీం ఆసి­ఫా­బా­ద్‌ జి­ల్లా­ల­కు హె­చ్చ­రి­క­లు జారీ అయ్యా­యి. ఈ జి­ల్లా­ల్లో కొ­న్ని చో­ట్ల 10 సెం.మీ.కు­పై­గా వర్షం కు­రి­సే అవ­కా­శా­లు ఉన్న­ట్లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. మరో­ప­క్క మంగళ, బు­ధ­వా­రా­ల్లో పలు రై­ళ్లు రద్దు చే­స్తు­న్న­ట్లు దక్షిణ మధ్య రై­ల్వే ప్ర­క­టిం­చిం­ది. రా­ష్ట్రం­లో తు­పా­ను పరి­స్థి­తి­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి ఆరా తీ­శా­రు. మం­త్రు­లు ఉత్త­మ్, తు­మ్మ­ల­తో మా­ట్లా­డా­రు.

తుఫాన్ ప్రభావంపై ఉత్తమ్ సమీక్ష

మొం­థా తు­పా­న్ ప్ర­భా­వం­పై తె­లం­గాణ ప్ర­భు­త్వం అప్ర­మ­త్త­మైం­ది. మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి తు­పా­న్ ప్ర­భా­వం సమీ­క్షా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. జరి­గిం­ది. తె­లం­గాణ రా­ష్ట్రం­పై తు­పా­న్ ప్ర­భా­వం ఏ మే­ర­కు ఉం­టుం­ద­నే వి­ష­యం గు­రిం­చి చర్చ జరి­గిం­ది. అలా­గే తు­పా­న్ ప్ర­భా­వం కా­ర­ణం­గా ధా­న్యం కొ­ను­గో­ళ్ల­కు ఆటం­కం లే­కుం­డా చూ­డా­ల­ని అధి­కా­రు­ల­ను మం­త్రి ఉత్త­మ్ కు­మా­ర్ రె­డ్డి ఆదే­శిం­చా­రు. టా­ర్పా­లి­న్ల­ను వి­ని­యో­గిం­చి ధా­న్యం తడ­వ­కుం­డా చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 8,342 కొ­ను­గో­లు కేం­ద్రా­లు ఏర్పా­టు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­మ­ని తె­లి­పా­రు. వీ­టి­ల్లో ఇప్ప­టి­కే 4,428 కేం­ద్రా­లు ప్రా­రం­భం అయ్యా­య­ని.. మి­గి­లి­న­వి త్వ­ర­లో ప్రా­రం­భం కా­బో­తు­న్న­ట్లు పే­ర్కొ­న్నా­రు. ఈ కేం­ద్రాల ద్వా­రా ఇప్ప­టి­వ­ర­కూ 22,433మంది రై­తుల నుం­చి 1.80లక్షల మె­ట్రి­క్ టన్నుల ధా­న్యం కొ­ను­గో­లు చే­సి­న­ట్లు మం­త్రి వె­ల్ల­డిం­చా­రు. ఇప్ప­టి­వ­ర­కూ కొ­ను­గో­లు చే­సిన ధా­న్యం వి­లువ దా­దా­పు రూ.431.09 కో­ట్లు ఉం­టుం­ద­ని తె­లి­పా­రు. అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆదే­శిం­చా­రు.

Tags

Next Story