REVANTH: రాష్ట్రానికి బీజేపీ చేసిందేమిటి?

REVANTH: రాష్ట్రానికి బీజేపీ చేసిందేమిటి?
X
సూటిగా ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ల ప్రాజెక్టును ఏపీకి తరలించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐటీఐఆర్ (ITIR) రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ భారం కూడా రాష్ట్రంపైనే వేశారని, ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడైనా గొంతు విప్పారా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటర్లు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా మారుస్తామని గతంలో మోదీ హామీ ఇచ్చారని, మూడుసార్లు ప్రధాని అయినా ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యాన్ని గమనించి, అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

"ఫెవికాల్ బంధం.. క్విడ్ ప్రో కో రాజకీయం"

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని CM రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలకు BRS మద్దతు తెలిపిందని, నోట్ల రద్దును అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం, ఫార్ములా-ఈ రేసు వంటి కేసుల్లో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లుగా వీరి బంధం ఉందని, క్విడ్ ప్రో కో పద్ధతిలో ఒకరినొకరు కాపాడు తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్న బీజేపీ నేతలు, గత 12 ఏళ్లుగా ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో GHMC ఎన్నికలప్పుడు 'బండి పోతే బండి, ఇళ్లు పోతే ఇళ్లు' ఇస్తామని ఆశ చూపి, తీరా అడిగితే ఇన్సూరెన్స్‌ ఉందంటూ మాట మార్చారని విమర్శించారు. ఇన్సూరెన్స్‌ ద్వారా వచ్చే దానికి బండి సంజయ్ సిఫార్సు ఎందుకన్నారు. మహారాష్ట్ర సీఎంను తెచ్చి ఇక్కడ అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.

Tags

Next Story