REVANTH: కవితను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వను

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఇది వారి ఇంటి సమస్య. ఆస్తి తగాదాల వల్ల వారి కుటుంబ సమస్యలు బజారున పడ్డాయి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారు. ఆ నలుగురిని తెలంగాణ ప్రజలు బహిష్కరించారు” అని రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కవిత వ్యవహారం .. వారి కుటుంబ సమస్య అని రేవంత్ స్పష్టం చేశారు. అయితే కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే మాత్రం వ్యతిరేకిస్తానని తెలిపారు. కవితపై హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు దాడి చేస్తున్నారని సానుభూతి తెలిపారు. వారి కుటుంబంలో ఆస్తి పంచాయతీ నడుస్తోందని.. తనకు సంబంధం లేదని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమం పేరుతో యువతను పొట్టన పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు ఆ ఉసురు తాకే కుమార్తె దూరమైందని రేవంత్ వ్యాఖ్యానించారు. గతంలో నా కూతురు పెళ్లికి వెళ్లకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.
సీబీఐ విచారణ ఆపుతోందే కిషన్‌రెడ్డి
కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఆపుతోందని కిషన్ రెడ్డేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సొంత అభిప్రాయాలు ఉండవని.. ఆయన కేటీఆర్ వద్ద నుంచి సలహాలు తీసుకుంటారన్నారు. కేటీఆర్ సలహాలతోనే కాళేశ్వరం పై సీబీఐ విచారణకు అడ్డం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీచేయడమే దీనికి సాక్ష్యమన్నారు. గతంలో కాళేశ్వరం కేసు సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి చెప్పారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కిషన్ రెడ్డి చెప్పారు కానీ ఇప్పటి వరకూ చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపైనా రేవంత్ స్పందించారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశం హైకోర్టు పరిధిలో ఉందని.. లేకపోతే సీబీఐకి ఇచ్చే వాళ్లమన్నారు.
డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం
డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. “మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్‌ను కంట్రోల్ చేస్తున్నాం. మా ఈగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారిని పట్టుకుంది. హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ గత ప్రభుత్వంలోనే ఏర్పడింది. కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో దొరికారు” అని ఆరోపించారు. మంత్రులను తాను భయపెట్టడం లేదని.. ఎవరి పని వారు చేసుకుంటున్నారని రేవంత్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా రేవంత్ చర్చించారు. నెలాఖరులోపు స్థానిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమన్నారు. అందుకే స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశంపై న్యాయనిపణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ లకు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై...సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చే వరకూ ఎదురు చూస్తామన్నారు.
ఫిరాయింపులపై నిర్ణయం స్పీకర్‌దే
“కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. హరీష్ రావే మాకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు” అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. “రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయి” అని విమర్శించారు.
నక్సలైట్లతో చర్చలు ఎందుకు జరపరు.?
నక్సలైట్లు లొంగిపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చాయని చెప్పారు. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు, నక్సలైట్లతో చర్చలు చెప్పడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. “లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు అని కేటీఆర్ చెప్పారు. మరి తమ్ముడు లోకేష్ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com