REVANTH: మీరు బాగా పనిచేస్తే.. మళ్లీ నేనే సీఎం

తెలంగాణలో విద్యా సంస్కరణలు అమలు చేసి.. రెండో సారి గెలవాలన్న స్వార్థంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నాని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గురువులు బాగా పనిచేస్తే వచ్చేసారి మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళావేదికలో నిర్వహించిన గురుపూజోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. గురుపూజోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని, విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతిసమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని, తెలంగాణకు నూతన విద్యా విధానం కావాలని తెలిపారు. "ముఖ్యమంత్రులు చాలా మంది రెవెన్యూ, ఆర్ధిక శాఖ, నీటిపారుదల శాఖలని వారి దగ్గర పెట్టుకుంటారు.కానీ తాను విద్యా శాఖనునా దగ్గర పెట్టుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా సంస్కరణలు అమలు చేసి రెండోసారి గెలుస్తా. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై విమర్శలు చేస్తున్నారు. విద్యా శాఖ ఇంకెవరికైనా ఇవ్వాలని విమర్శిస్తున్నారు.” అని అన్నారు.
బీఆర్ఎస్పై విమర్శలు
కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి పదేళ్లు గడిచింది.. మరి అది అమలు జరిగిందా అనేది మీరే ఆలోచించుకోవాలని టీచర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతీ పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనన్నారు. పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదు ..2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు ..మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామన్నారు. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నించారన్నారు. విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుందని రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో నూతన నియామకాలు లేవని ఆరోపించారు. గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు చెప్పారు. "పిల్లలతో కలిసే టీచర్ల మధ్యాహ్న భోజనం చేయాలి. , టీచర్ల చొరవతో కొత్తగా 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.” అని రేవంత్రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com