REVANTH: విప్లవాత్మక మార్పులకు "మహాలక్ష్మి" కారణం

REVANTH: విప్లవాత్మక మార్పులకు మహాలక్ష్మి కారణం
X
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

తె­లం­గాణ ప్ర­భు­త్వం అమలు చే­స్తు­న్న మహి­ళ­ల­కు ఉచిత బస్సు ప్ర­యా­ణం 'మ­హా­ల­క్ష్మి' ఒక సం­క్షేమ పథకం.. అనేక వి­ప్ల­వా­త్మక మా­ర్పు­ల­కు కా­ర­ణ­మైం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి కొ­ని­యా­డా­రు. కొం­ద­రు ఎగ­తా­ళి చే­సి­నా ఆర్టీ­సీ­లో ఉచిత ప్ర­యాణ పథకం.. ఆడ­బి­డ్డ­ల­కు ఆర్థిక భారం తగ్గిం­చి ఆరో­గ్య రక్ష­ణ­కు ఆస­రా­గా ని­లి­చి ఆనం­ద­కర జీ­వి­తా­ని­కి ఆలం­బన అయ్యిం­ద­ని ము­ఖ్య­మం­త్రి ఎక్స్ వే­ది­క­గా ట్వీ­ట్ చే­శా­రు. మహా­ల­క్ష్మి పథ­కం­లో భా­గం­గా నే­టి­కి 200 కో­ట్ల మంది మహి­ళ­లు ఉచిత బస్సు సౌ­క­ర్యా­న్ని వి­ని­యో­గిం­చు­కు­న్నా­రు. ఇది ఈ పథకం అమ­లు­లో మరో మై­లు­రా­యి­గా ని­లి­చిం­ది. మహా­ల­క్ష్మి పథకం వి­జ­య­వం­తా­ని­కి కా­ర­ణ­మైన వా­రి­పై రే­వం­త్ ప్ర­శం­సల వర్షం కు­రి­పిం­చా­రు. ఈ ఒక్క పథకం వల్ల ఆర్టీ­సీ­లో ఆడ­బి­డ్డల ఆక్యు­పె­న్సీ 35 నుం­డి 60 శా­తా­ని­కి పె­రి­గిం­ద­ని… పేద ఆడ­బి­డ్డ­లు చి­న్న చి­న్న ఆరో­గ్య సమ­స్యల చి­కి­త్స కోసం ఆసు­ప­త్రు­ల­కు వచ్చే సం­ఖ్య 31 శాతం పె­రి­గిం­ద­ని సీఎం తె­లి­పా­రు. ప్ర­జా పాలన ప్రా­రం­భ­మ­య్యే నా­టి­కి ఇక ఆర్టీ­సీ కథ కం­చి­కే అన్న పరి­స్థి­తి ఉం­ద­ని పే­ద­వా­డి ప్ర­గ­తి రథ చక్రం ఇక చరి­త్ర పు­ట­ల్లో­కి జారి పో­తుం­ద­నే పరి­స్థి­తి నె­ల­కొ­ని ఉం­ద­న్నా­రు. అటు­వం­టి పరి­స్థి­తుల నుం­చి మొ­ద­లైన ప్ర­యా­ణం నేడు 200 కో­ట్ల జీరో టి­కె­ట్ల­తో ఆడ­బి­డ్డ­ల­కు సహా­యం చేసే స్థా­యి­కి ఎది­గిం­ద­న్నా­రు.

Tags

Next Story