TG: హైదరాబాద్‌లో రూ.8,858 కోట్లతో కొత్త ప్రాజెక్టులు

TG: హైదరాబాద్‌లో రూ.8,858 కోట్లతో కొత్త ప్రాజెక్టులు
X
హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు చెక్‌ పెట్టే నిర్ణయం.. ఒకేసారి ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభించనున్న సీఎం.. హైబ్రిడ్ అన్యుటీ మోడల్‌లో ప్రాజెక్టుల నిర్మాణం

హై­ద­రా­బా­ద్ పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి వరాల జల్లు కు­రి­పిం­చా­రు. మం­చి­నీ­టి సర­ఫ­రా నెట్ వర్క్ ను మరింత బలో­పే­తం చే­య­డా­ని­కి, వే­గం­గా వి­స్త­రి­స్తు­న్న శి­వా­రు ప్రాం­తాల అవ­స­రా­ల­ను తీ­ర్చ­డా­ని­కి 8,858 కో­ట్ల రూ­పా­యల వ్య­యం­తో గో­దా­వ­రి నీటి తర­లిం­పు పథ­కా­ల­ను ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. ఫేస్-2, ఫేస్- 3 ఇం­దు­లో ఉన్నా­యి. హై­ద­రా­బా­ద్ కోర్ సి­టీ­తో పాటు శి­వా­రు ప్రాం­తా­ల­కూ మం­చి­నీ­టి తర­లిం­పు మరింత సు­ల­భ­త­ర­మౌ­తుం­ది. గో­దా­వ­రి మం­చి­నీ­టి పథకం రెం­డు, మూ­డు­ద­శల కోసం 7,360 కో­ట్లు కే­టా­యిం­చా­రు. ఈ ప్రా­జె­క్టు కింద మల్ల­న్న­సా­గ­ర్ జలా­శ­యం నుం­డి 20 టీ­ఎం­సీల నీ­టి­ని తీ­సు­కుం­టా­రు. ఇం­దు­లో 2.5 టీ­ఎం­సీ­ల­ను మూసీ నది పు­న­రు­జ్జీ­వ­నం కోసం ఉస్మా­న్‌ సా­గ­ర్, హి­మా­య­త్‌ సా­గ­ర్‌­ల­కు మళ్లి­స్తా­రు. మి­గి­లిన 17.5 టీ­ఎం­సీ­లు హై­ద­రా­బా­ద్ మం­చి­నీ­టి అవ­స­రా­ల­కు ఉప­యో­గ­ప­డ­తా­యి. ఈ క్ర­మం­లో ఏడు మధ్య­స్థ సర­స్సు­ల­ను కూడా గో­దా­వ­రి జి­లా­ల­తో నిం­పు­తా­రు.

మల్లన్నసాగర్ నుంచి...

మొ­త్తం రూ.7,360 కో­ట్ల­తో చే­ప­ట్టిన గో­దా­వ­రి డ్రిం­కిం­గ్ వా­ట­ర్ స్కీ­మ్‌­లో మల్ల­న్న­సా­గ­ర్ రి­జ­ర్వా­య­ర్‌ నుం­చి 20 టీ­ఎం­సీల నీ­టి­ని తీ­సు­కొ­చ్చే ఏర్పా­ట్లు చే­శా­రు. ఇం­దు­లో 2.5 టీ­ఎం­సీల నీ­టి­ని ఉస్మా­న్ సా­గ­ర్, హి­మా­య­త్ సా­గ­ర్‌ల ద్వా­రా ముసీ నది­కి వది­లి పు­న­రు­ద్ధ­రి­స్తా­రు. మి­గి­లిన 17.5 టీ­ఎం­సీ­లు హై­ద­రా­బా­ద్ తా­గు­నీ­టి అవ­స­రాల కోసం వి­ని­యో­గి­స్తా­రు. ఈ మా­ర్గం­లో ఉన్న ఏడు మధ్యం­తర చె­రు­వు­లు కూడా నిం­డే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­రు. హై­బ్రి­డ్ అన్యు­టీ మో­డ­ల్‌­లో ని­ర్మి­స్తు­న్న ఈ ప్రా­జె­క్టు­ను రెం­డు సం­వ­త్స­రా­ల్లో పూ­ర్తి చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్

హై­బ్రి­డ్ యా­న్యు­టీ మో­డ­ల్ కింద చే­ప­ట్టిన ఈ ప్రా­జె­క్టు­ను రెం­డే­ళ్ల­లో పూ­ర్తి చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. అదే సమ­యం­లో- ఔటర్ రిం­గ్ రోడ్ మం­చి­నీ­టి సర­ఫ­రా ప్రా­జె­క్టు మూ­డో­ద­శ­నూ రే­వం­త్ రె­డ్డి ప్రా­రం­భి­స్తా­రు. దీ­ని­కి 1,200 కో­ట్లు రూ­పా­య­లు ఖర్చ­వు­తుం­ది. ఈ ప్రా­జె­క్టు జీ­హె­చ్‌­ఎం­సీ పరి­ధి, దాని చు­ట్టు­ప­క్కల గల ము­ని­సి­పా­లి­టీ­లు, ము­ని­సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్లు, ఔటర్ రిం­గ్ రోడ్ వెం­బ­డి ఉన్న గ్రామ పం­చా­య­తీ­ల­కు వి­స్త­రిం­చి ఉంది. అంతే కా­కుం­డా.. రూ.1,200 కో­ట్ల వ్య­యం­తో ఓఆ­ర్ఆ­ర్ డ్రిం­కిం­గ్ వా­ట­ర్ సప్లై ప్రా­జె­క్ట్ (ఫేజ్-2)ను సీఎం ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. ఈ ప్రా­జె­క్ట్ జి­హె­చ్ఎం­సీ పరి­ధి, సమీప ము­న్సి­పా­లి­టీ­లు, ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్లు, అలా­గే ఓఆ­ర్ఆ­ర్ పరి­ధి­లో­ని పలు గ్రామ పం­చా­య­తీ­ల­కు నీటి సర­ఫ­రా అం­దిం­చ­నుం­ది. మొ­త్తం 71 రి­జ­ర్వా­య­ర్లు ని­ర్మిం­చ­గా.. అం­దు­లో 15 రి­జ­ర్వా­య­ర్ల­ను ఈసా­రి ప్రా­రం­భి­స్తు­న్నా­రు. సరూ­ర్‌­న­గ­ర్, మహే­శ్వ­రం, శం­షా­బా­ద్, హయ­త్‌­న­గ­ర్, ఇబ్ర­హీం­ప­ట్నం, ఘట్‌­కే­స­ర్, కీసర, రా­జేం­ద్ర­న­గ­ర్, శా­మీ­ర్పే­ట్, మే­డ్చ­ల్, కు­త్బు­ల్లా­పూ­ర్, ఆర్‌­సీ పురం, పటా­న్‌­చె­రు, బో­లా­రం ప్రాం­తా­ల్లో 14 మం­డ­లా­ల­కు చెం­దిన 25 లక్షల మం­ది­కి ఈ పథకం ద్వా­రా తా­గు­నీ­రు అం­దు­తుం­ది. కో­కా­పే­ట్ లే­అ­వు­ట్, నీ­యో­పో­లి­స్, ఎస్ఈ­జ­డ్ ప్రాం­తా­ల్లో తా­గు­నీ­టి సర­ఫ­రా.. మలి­న­జల శు­ద్ధి కోసం రూ.298 కో­ట్ల­తో ప్ర­త్యేక ప్రా­జె­క్ట్‌­కు సీఎం పు­నా­ది వే­య­ను­న్నా­రు.

Tags

Next Story