Revanth Reddy : మొదలైన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్ర

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్ర ప్రాంరంభమైంది. సోమవారం సమక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్న రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లిన రేవంత్ కు కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వాగతం పలికారు. గద్దెల ప్రాంగణంలో బంగారంతో రేవంత్ తులాభారం వేశారు. అమ్మవార్ల దర్శనాంతరం పాదయాత్రను ప్రారంభించారు.
పాదయాత్రలో రేంవంత్ కు హారతులు పట్టారు ఆడబిడ్డలు. పాదయాత్రను ప్రజల యాత్రగా మారుస్తామని అన్నారు రేవంత్. భారత్ జోడో యాత్రకు పొడిగింపుగా 'హాత్ సే హాత్ జోడో' యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్నప్రజా వ్యతిరేక విధానలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో ముందుకు కదిలిన ఆయన.. ప్రజాసంఘాల నేతలతో భేటీ అయ్యారు. సాయంత్రం పస్రాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలిరోజు యాత్ర సుమారు 15 నుండి 20కిలోమీటర్ల మేర పూర్తి చేసుకుని.. రామప్ప గ్రామం వరకు కొనసాగనుంది. రేవంత్ తో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com