Revanth Reddy : 19వ రోజు కొనసాగుతున్న 'హాత్ సే హాత్ జోడో'

Revanth Reddy : 19వ రోజు కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో
X


19వ రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ మాన కొండూరు నియోజకవర్గంలోని పొలంపల్లి నుంచి ఉదయం 8 గంటలకు యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్ర ప్రారంభమయింది. పాదయాత్రలో మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 4గంటలకు మన్యం పల్లిలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పోరండ్ల, ముంజంపల్లి మీదుగా మానకొండూర్ వరకు సాగనుంది. రాత్రి 7 గంటలకు మానకొండూర్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్ ప్రసంగించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం పద్మానగర్‌లో రాత్రి బస చేయనున్నారు.

Next Story