Revanth Reddy: ఆంధ్ర పెట్టుబడిదారులకు మాత్రమే ప్రగతి భవన్ లోకి ప్రవేశం: రేవంత్

Revanth Reddy: ప్రగతి భవన్ ను పేల్చివేయాలన్న తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిమాకు కేసులు మాకు కొత్తేమి కాదని, ప్రగతిభవన్ లో ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదని అడుగుతున్నామన్నారు. కేసీఆర్ నమ్ముకుంది పోలీసులు, మద్యం, డబ్బులని మాత్రమేనని అన్నారు. అమరవీరుల కుటుంబాలను కూడా ప్రగతిభవన్ లో అడుగుపెట్టకుండా నిషేధించినప్పుడు ప్రగతి భవన్ ఉంటే ఎంత,పోతే ఎంత..? అని రేవంత్ ప్రశ్నించారు.
ఆంధ్రా నుంచి వచ్చిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, ప్రసాద్, మెగా కృష్ణారెడ్డి లకు రెడ్ కార్పెట్ పరిచి పంచభక్ష పరమాన్నం పెడితే తెలంగాణ ప్రజలకు కడుపు మండదా..? అంటూ ఫైర్ అయిన రేవంత్ కేసిఆర్ తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గతంలో దొరల గడిలను కూల్చివేసిన మావోయిస్టులు ప్రగతి భవన్ కూడా కూల్చివేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉంటే ఏంది, లేకుంటే ఏంది… అందుకే మావోయిస్టులు డైనమేట్లు పెట్టి ప్రగతి భవన్ ను పేల్చివేస్తే మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో 120 గదుల ప్రగతి భవన్ ను హైదరాబాద్ నడిబొడ్డున కేసీఆర్ నిర్మించాడని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రగతి భవన్ లోకి ప్రజలకు ప్రవేశం ఉండదని తెలిపారు. ఆంధ్ర పెట్టుబడిదారీలకు మాత్రమే ప్రగతి భవన్ లోకి ప్రవేశం ఉంటుందన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఈ సంచలన కామెంట్స్ చేశారు.
మరోవైపు రేవంత్ కామెంట్స్ పై బీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ నమోదుచేయాలని ములుగు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేసారు. రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దీనితో రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి యాత్ర ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన బీఆర్‌ఎస్ శ్రేణులు పిర్యాదు చేయగా ఇక నర్సంపేట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు రెడీ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com