Revanth Reddy : తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ఎప్పుడు వస్తుందో ప్రకటించిన రేవంత్ రెడ్డి..

Revanth Reddy : తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ఎప్పుడు వస్తుందో ప్రకటించిన రేవంత్ రెడ్డి..
X
Revanth Reddy : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణకు వస్తుందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Revanth Reddy : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణకు వస్తుందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. మక్తల్ నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవుతుందన్నారు. దీనిపై చర్చించేందుకు అక్టోబర్ 4న జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ హైదారాబాద్ వస్తున్నారన్నారు. రూట్ మ్యాప్‌పై చర్చించి ఏఐసిసి ఆమోదం తీసుకుంటామన్నారు. పాదయాత్ర ఏర్పాట్ల కోసం కమిటీలు వేస్తున్నట్లు తెలిపారు.

ఉద్యమకారులను రాహుల్ గాంధీకి కలిపిస్తామన్నారు. భారత్‌ జోడో యాత్ర జుక్కల్ నియోజక వర్గం నుంచి మహారాష్ట్రలోకి వెళుతుందని తెలిపారు. పాదయాత్ర అనుమతి కోసం రేపు డీజీపీని కలుస్తామన్నారు. దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్‌ ఈ యాత్ర చేస్తున్నారని... ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు రేవంత్‌.

Tags

Next Story