దళితులకు అన్యాయం చేసిన వాళ్లలో మొదటి దోషి ముఖ్యమంత్రే : రేవంత్‌రెడ్డి

X
దళితబంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలవాలనే ఆయన దళితజపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు టైమ్‌కు ఇస్తే ఏడేళ్లలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు దళిత- గిరిజనులకు వచ్చేవని అన్నారు. 30 లక్షల మంది దళిత కుటుంబాలకు, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధుపై శాసనసభలో ఒకరోజు చర్చ జరిపి తీర్మానం చెయ్యాలని కోరారు. ఆరు నెలల లోపు ప్రతి దళిత కుటుంబానికి 10లక్షలు ఇస్తా అంటే.. తామంతా ఎక్కడైనా సంతకాలు పెట్టేందుకు సిద్ధమన్నారు రేవంత్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
