Revanth Reddy: మిగతా లక్షా 13వేల ఉద్యోగాలను ఎవరు ఎత్తుకెళ్లారు-రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: మిగతా లక్షా 13వేల ఉద్యోగాలను ఎవరు ఎత్తుకెళ్లారు-రేవంత్‌ రెడ్డి
X
Revanth Reddy:2018లో ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 90వేల ఖాళీలు గుర్తించిందని చెప్పారు

Revanth Reddy: 2014లోనే లక్షా 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్‌.. ఇపుడు 80వేలు భర్తీ చేస్తాననడం పట్ల పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఫైరయ్యారు. 2018లో ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ.. వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 90వేల ఖాళీలను గుర్తించిందని చెప్పారు. ఆ లెక్కనే చూసుకుంటే లక్షా 13వేల ఉద్యోగాలను ఎవరు ఎత్తుకెళ్లారని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన నోటిఫికేషన్ల కోసం అసెంబ్లీ, సచివాలయం, ప్రగతిభవన్‌లను యూత్‌కాంగ్రెస్‌ ముట్టడించడంతోనే కేసీఆర్‌ దిగొచ్చారన్నారు.

Tags

Next Story