Revanth Reddy :కేటీఆర్ తనను సీఎం చేయాలని కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy (tv5news.in)
Revanth Reddy : గవర్నర్ ఢిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వచ్చాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కుటుంబంలో ఉన్న సమస్యలను తప్పించుకునేందుకు.. కేసీఆర్ గవర్నర్‌ను సాకుగా చూపుతున్నారని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో గవర్నర్ వివాదంపై రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.
కేటీఆర్ తనను సీఎం చేయాలని కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారని... గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమవుతుందని కేసీఆర్ కుటుంబ సభ్యులతో చెప్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్‌ను సాకుగా చూపి కేసీఆర్ కుటుంబ సమస్య నుంచి తప్పించుకుంటున్నారన్నారు. గవర్నర్‌కు సమీక్షించే సర్వాధికారాలను రాజ్యాంగం కట్టబెట్టిందన్న రేవంత్ రెడ్డి..విద్య, వైద్యం, శాంతి భద్రతల సమస్యలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టవచ్చన్నారు.
గవర్నర్ తక్షణమే తన అధికారులను ఉపయోగించుకోవాలన్నారు. ఇప్పటికే సమస్య లను గవర్నర్ గుర్తించారని.. ఫిర్యాదు కూడా చేశారన్నారు. సమస్య పరిష్కారం చేసే అధికారం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఉందని.. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు.. తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com