Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లపై కొనసాగుతున్న ట్విటర్ వార్.. ఎమ్మెల్సీ కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్

X
Revanth Reddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్-టీఆర్‌ఎస్‌ల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై రాహుల్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత కౌంటర్ ఇవ్వడంతో రచ్చ మొదలైంది. తాజాగా ఎమ్మెల్సీ కవితకు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధత.. కవితకు తెలియకపోవడం బాధాకరమన్న రేవంత్.
కాంగ్రెస్ కృషి గురించి సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ ఎంతో అభివృద్ధి చేసిందన్న రేవంత్.. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం, భూమిలేని పేదలకు అసైన్‌మెంట్ భూములు ఇచ్చామన్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసి ప్రజల 60ఏళ్ల కలను నెరవేర్చామన్నారు రేవంత్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
