Revanth Reddy: రాహుల్ గాంధీ ఓయూకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాహుల్ గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఓయూ సందర్శనకు అనుమతి కావాలంటూ వీసీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్‌లు కోరారని ఆయన వెల్లడించారు. అయితే రాహుల్ గాంధీ ఓయూకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్ ఓయూకు రాకుండా అడ్డుకుంటున్నారంటే కేసీఆర్ మనస్తత్వం ఏంటో అర్ధమవుతుందన్నారు.
బానిసలు మాట్లాడే మాటలకు తాను సమాధానం చెప్పనని.. వారిని అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం చెప్పులతో కొట్టాలన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన షెడ్యూలు విడుదలైంది. మే 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ కు చేరుకొని .. రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు.
రాత్రి 7గంటలకు రాహుల్ గాంధీప్రసంగం ప్రారంభం అవుతుంది. సభ అనంతరం రోడ్డుమార్గం గుండా హైదరాబాద్‌కు చేరుకుంటారు రాహుల్ గాంధీ. దుర్గం చెరువు పక్కన ఉన్న కోహినూర్ హోటల్‌లో బస చేస్తారు. 7వ తేదీ ఉదయం సంజీవయ్య పార్కుకు వెళ్లి నివాళులర్పిస్తారు. ఇదే రోజు రాహుల్ గాంధీతో ఓయూలో సభ నిర్వహించాలని విద్యార్ధి సంఘం భావించింది.
గాంధీభవన్‌కు చేరుకొని 200 మంది ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. డిజిటల్ మెంబర్ షిప్ ఎన్‌రోలర్స్‌తో ఫోటో సెషన్ లో పాల్గొంటారు. అనంతరం తెలంగాణ అమరవీరులతో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని.. ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com