TS: ప్రతి రైతుకు "రైతు భరోసా"...!

తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ నెల 4న జరిగే కేబినెట్ భేటీలో ఈ పథకం అమలు, మార్గదర్శకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లించే అవకాశం ఉంది.
జనవరి 14 నుంచి రైతు భరోసా
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 5 నుంచి 7 వరకు ఈ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్టు సమాచారం.
రైతులకు మేలు చేసేందుకే రెవెన్యూ సదస్సులు
రైతులకు మేలు చేయటానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రామకోటేశ్వరరావు అన్నారు. శేరిగొల్వేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. శేరిగొల్వేపల్లి ఆయకట్టు పరిధిలో సమస్య లను పరిష్కరించటానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పేర్లు మార్పులు, చేర్పులు, ఇతర సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. ఆర్ఎస్ఐ నాగబాబు, మాజీ సర్పంచ్ మెరుగుమాల బసవపున్నయ్య, కాటూరి శివాజీ పాల్గొన్నారు.
ప్రతి రైతుకు ఇవ్వాలన్న హరీష్ రావు
గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన మాదిరిగా ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని మాజి మాంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో డిమాండ్ చేశారు, సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట మేరకు ఎకరానికి రూ.15వేలు రైతు భరోసా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com