Revanth Reddy : కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇంట్లో ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదు : రేవంత్ రెడ్డి

Revanth Reddy : రాజకీయాలకు, ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా రాహుల్ గాంధీ... రేపటి నుండి భారత్ జోడో పర్యటన మొదలుపెడుతున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ పాలనలో దేశంలో విద్వేషం రాజ్యమేలుతోందని మండిపడ్డారు.
ప్రజలకు భరోసా కోసమే రాహుల్ గాంధ భారత్ జోడో యాత్ర చేపట్టారని, అక్టోబర్ 24, 25 తేదీల్లో రాహుల్ యాత్ర తెలంగాణలో అడుగు పెడుతుందన్నారు. తెలంగాణలో 15 రోజుల పాటు సుమారు 350 కిలో మీటర్లు మేర యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఎందుకు ఈడీ దాడులు జరగడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ స్కాం వ్యవహారంలో ఎక్కడో బెదిరించి, ఎక్కడో లొంగదీసుకునే ఆలోచన కనిపిస్తోందన్నారు. ఇలాంటి స్కాంలకు కేంద్రం ప్రగతి భవన్ అని, అక్కడ సోదాలు చేయకుండా బీజేపీ కల్లబొల్లి కబుర్లు చెబితే కుదరదని దుయ్యబట్టారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com