REVANTH: బీజేపీ లాభం కోసం దేశానికి నష్టం చేస్తారా?

REVANTH: బీజేపీ లాభం కోసం దేశానికి నష్టం చేస్తారా?
X
డీలిమిటేషన్‍తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. దీర్ఘకాలిక నష్టం తప్పదని సీఎం హెచ్చరిక.. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు

దేశ రా­జ­కీ­యా­ల్లో డీ­లి­మి­టే­ష­న్ అంశం మళ్లీ చర్చ­నీ­యాం­శం­గా మా­రు­తు­న్న వేళ, రా­ష్ట్రాల మధ్య సమ­తు­ల్యత, న్యా­యం, ప్ర­జా­స్వా­మ్య ప్ర­తి­ని­ధి­త్వం వంటి కీలక అం­శా­ల­పై తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి గళ­మె­త్తా­రు. జనా­భా ఆధా­రం­గా లో­క్‌­సభ ని­యో­జ­క­వ­ర్గాల పు­న­ర్వి­భ­జన చే­ప­ట్ట­డం దేశ సమ­గ్ర­త­కు దీ­ర్ఘ­కా­లం­లో హా­ని­క­ర­మ­వు­తుం­ద­ని ఆయన హె­చ్చ­రిం­చా­రు. తా­త్కా­లిక రా­జ­కీయ లా­భాల కోసం తీ­సు­కు­నే ని­ర్ణ­యా­లు భవి­ష్య­త్‌­లో తీ­వ్ర­మైన అస­మా­న­త­ల­కు దా­రి­తీ­స్తా­య­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. డీ­లి­మి­టే­ష­న్‌­పై కేం­ద్ర ప్ర­భు­త్వం ముం­దు­కు తీ­సు­కె­ళ్తు­న్న వి­ధా­నం­పై ఆయన తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. ము­ఖ్యం­గా దక్షి­ణా­ది రా­ష్ట్రా­లు, చి­న్న రా­ష్ట్రా­ల­కు అన్యా­యం జరి­గే అవ­కా­శం ఉం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. ఈ వి­ష­యం­పై ప్ర­ధా­ని నరేం­ద్ర మో­దీ­కి సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా తన అభి­ప్రా­యా­ల­ను తె­లి­య­జే­సిన రే­వం­త్ రె­డ్డి, మహి­ళా రి­జ­ర్వే­ష­న్లు మరి­యు డీ­లి­మి­టే­ష­న్ రెం­డూ వే­ర్వే­రు అం­శా­ల­ని గు­ర్తు చే­శా­రు. మహి­ళ­ల­కు రా­జ­కీ­యా­ల్లో ప్రా­తి­ని­ధ్యం కల్పిం­చ­డం అత్యంత అవ­స­ర­మ­ని, అయి­తే దా­న్ని ఒక కవ­చం­గా ఉప­యో­గిం­చి జనా­భా ఆధా­రిత డీ­లి­మి­టే­ష­న్‌­ను ముం­దు­కు తే­వ­డం సరి­కా­ద­ని వి­మ­ర్శిం­చా­రు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత మహిళలకు ఓటు హక్కు కల్పించడం నుంచి ప్రారంభమైన ప్రయాణంలో రాజకీయ రిజర్వేషన్ల వరకు కాంగ్రెస్ పాత్ర కీలకమని గుర్తు చేశారు.

ప్ర­స్తు­తం కూడా 33 శాతం మహి­ళా రి­జ­ర్వే­ష­న్ల­ను వెం­ట­నే అమలు చే­యా­ల­ని ఆయన డి­మాం­డ్ చే­శా­రు. దీ­ని­ని డీ­లి­మి­టే­ష­న్‌­తో ము­డి­పె­ట్ట­డం అన­వ­స­ర­మ­ని, రా­జ­కీయ ఉద్దే­శం­తో జరు­గు­తోం­ద­ని ఆయన ఆరో­పిం­చా­రు. డీ­లి­మి­టే­ష­న్ ప్ర­క్రి­య­ను 2011 జనా­భా లె­క్కల ఆధా­రం­గా చే­ప­ట్టా­ల­ని కేం­ద్రం ఆలో­చి­స్తు­న్న­ద­ని ఆయన వి­మ­ర్శిం­చా­రు. అయి­తే 2026 జనా­భా గణాం­కాల ప్ర­కా­రం ఈ ప్ర­క్రియ జర­గా­ల­ని కాం­గ్రె­స్ డి­మాం­డ్ చే­స్తోం­ద­ని చె­ప్పా­రు. పాత లె­క్కల ఆధా­రం­గా ముం­దు­కు వె­ళ్ల­డం వె­నుక దాగి ఉన్న ఉద్దే­శా­ల­ను ఆయన ప్ర­శ్నిం­చా­రు. ఇది దే­శం­లో­ని కొ­న్ని ప్రాం­తా­ల­కు అను­కూ­లం­గా, మరి­కొ­న్ని ప్రాం­తా­ల­కు ప్ర­తి­కూ­లం­గా మారే ప్ర­మా­దం ఉం­ద­ని పే­ర్కొ­న్నా­రు.

దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సమర్థంగా అమలు చేసి జనాభా పెరుగుదలను నియంత్రించాయని ఆయన వివరించారు. దీనికి విరుద్ధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరిగిందని చెప్పారు. ఇప్పుడు అదే జనాభాను ప్రాతిపదికగా తీసుకుని సీట్లను పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో ప్రాంతీయ అసమానతలను మరింత పెంచే అవకాశముందని హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విధంగా ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లను పెంచితే, పెద్ద రాష్ట్రాలకు అధిక లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.

Tags

Next Story