Revanth Reddy : రేవంత్ రెడ్డి సారీకి కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే..?

Revanth Reddy : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటే తమకు గౌరవం ఉందన్నారు. అద్దంకి దయాకర్‌పై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పిన క్షమాపణలను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. అప్పటి వరకు మునుగోడుకు దూరంగా ఉంటానని తేల్చి చెబుతున్నారు.
హోంగార్డ్ ప్రస్తావన, మునుగోడు సభలో అద్దంకి దయాకర్.. అసభ్యకరమైన పదజాలం వాడటంతో వెంకటరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ బహిరంగ క్షమాపణ చెప్పారు రేవంత్. దయాకర్‌పై చర్యలు తప్పవన్నారు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేశామన్నారు. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదని పేర్కొన్నారు.
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డిని అవమానించే విధంగా మాట్లాడటం తగదన్నారు. అటు.. వెంకటరెడ్డికి మరోసారి క్షమాపణ చెబుతున్నానన్నారు అద్దంకి దయాకర్. భవిష్యత్‌లో మరోసారి అలా జరగనివ్వనని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com