Revanth Reddy : మునుగోడులో ప్రచార దూకుడు పెంచిన కాంగ్రెస్..
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను తప్పకుండా గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దుబ్బాక, హూజూరాబాద్‌లో బీజేపీ గెలిచినా.. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా రాష్ట్రంలో మార్పు జరగలేదన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని రేవంత్ ఆరోపించారు. మునుగోడు మహిళలందరూ.. తోటి మహిళ అయిన పాల్వాయి స్రవంతికి ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలన్నారు రేవంత్.
మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్టుగా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా ఇవాళ రేవంత్ రెడ్డి చౌటుప్పల్‌లో రోడ్ షో నిర్వహించారు. అభ్యర్థి పాల్వయి స్రవంతి తరపున ప్రచారం చేశారు. ఈ రోడ్ షో కొయ్యలగూడెం నుంచి సంస్థాన్ నారాయణపురం వరకు కొనసాగనుంది. రేవంత్ రోడ్ షోలో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ క్యాడర్ కూడా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com