కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యం : రేవంత్

దళిత, గిరిజనుల పక్షాన కాంగ్రెస్ పోరు మరింత ఉద్ధృతం చేసింది. ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ దళిత, గిరిజన దీక్ష చేపట్టనుంది. కేసీఆర్ దత్తత గ్రామం ముడుచింతల పల్లిలో 48 గంటల దీక్ష చేపట్టనుంది. కేసీఆర్ దత్తత గ్రామం వేదికగా గులాబీ సర్కార్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోరుబాట పట్టనున్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ముడుచింతలపల్లి గ్రామంలో దళిత, గిరిజన దీక్ష చేపట్టనునన్నారు.
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని... అందుకే అక్కడ దళిత, గిరిజన దీక్ష చేపడతామని రేవంత్ తెలిపారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ముడుచింతల పల్లిలో ఎంత అభివృద్ధి జరిగిందో మీడియాకు చూపిస్తామన్నారు. ఇక హుజురాబాద్ ఎన్నికల అంశాలు దామోదర రాజనర్సింహ చూస్తున్నారని... అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం అంతా ఆయన ఆధ్వర్యంలో కమిటీ చూస్తోందన్నారు.
ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కావడానికి కారణం కేసీఆరేనని రేవంత్ అన్నారు. ఈటలతో చర్చలకు ఢిల్లీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డికి ప్రైవేట్ విమానాన్ని కేసీఆరే ఇచ్చారని ఆరోపించారు. టీఆర్‌ఎస్, బీజేపీలది కొనుగోలు రాజకీయాలని మండిపడ్డారు. ఈటల అవినీతి గురించి హడావిడి చేసిన కేసీఆర్.. బీజేపీలోకి చేరాక ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టడం ఖాయమన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను గజ్వేల్‌కు వెళ్తానన్నారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం... ఎమ్మెల్సీ ఇస్తాననడం చైల్డ్ రేట్ లాంటిదని ఘాటుగా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపైనే పోరాడుతుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com