Revanth Reddy: రేవంత్ రెడ్డి అనే నేను .. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ..

Revanth Reddy: రేవంత్ రెడ్డి అనే నేను .. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ..
X
7న ప్రమాణ స్వీకారం

తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖారారు అయ్యింది. ఢిల్లీలో ఖర్గే ఇంట్లో అధిష్ఠానం చర్చోపచర్చల అనంతరం సీఎం ఎంపిక పుర్తయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించారు. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సీనియర్లందరికీ ప్రాధాన్యత ఉంటుందని,అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.


Tags

Next Story