Revanth Reddy : రేపు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్‌రెడ్డి..!
Revanth Reddy : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు రేవంత్‌రెడ్డి రెడ్డి. అనంతరం గాంధీభవన్ ఆవరణలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు..రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి..లక్షకుపైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం పెద్దమ్మతల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. రేవంత్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు..అటు గాంధీభవన్ సుందరీకరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి..
ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్న తర్వాత భారీ సభ నిర్వహించనున్నారు రేవంత్‌రెడ్డి. ఈ కార్యక్రమానికి మల్లికార్జునఖర్గే, మాణిక్యం ఠాగూర్ వంటి సీనియర్ నేతలు హాజరుకానున్నారు...ఇక సాయంత్రం ఉత్తమ్, భట్టితో రేవంత్ సమావేశం కానున్నారు..ఇప్పటికే అందరు సీనియర్ నేతల్ని కలిశారు రేవంత్. పార్టీలో అసంతృప్తలందరినీ బుజ్జగించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. రేవంత్ పేరు ప్రకటించినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలంతా ఇప్పుడు అలక వీడారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com