Revanth Reddy: ధాన్యం కుంభకోణంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఉన్నారు- రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: ధాన్యం కుంభకోణంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఉన్నారు- రేవంత్‌ రెడ్డి
X
Revanth Reddy: సీఎంఆర్‌ ధాన్యం కుంభకోణంలో ముఖ్యుల పాత్రపై విచారణ జరిపించాలని కిషన్‌ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

Revanth Reddy: సీఎంఆర్‌ ధాన్యం కుంభకోణంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యుల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం కాదని, తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

సీఎంఆర్‌ పేరుతో రైస్‌ మిల్లుల్లో జరుగుతున్న అవకతవకలు, బియ్యం రీసైక్లింగ్‌పై తక్షణ సీబీఐ విచారణ చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్‌ కేటాయింపులు, ఎఫ్‌సీఐకు చేసిన సరఫరా, గాయబ్‌ అయిన బియ్యం నిల్లవలు.. అన్నింటిపై సమగ్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Tags

Next Story