Revanth Reddy: పంట నష్టం జరగలేదని కేటీఆర్ చెప్పడం మూర్ఖత్వం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు రేవంత్. తక్షణ సాయంగా తెలంగాణకు 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలన్నారు. వరదల కారణంగా 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎకరాకు 15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, పెట్టుబడి సాయం అందించాలన్నారు.
కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలతో ప్రజలను, రైతులను మభ్య పెడుతున్నారని ఆరోపించారు రేవంత్. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తనతో కలిసి పర్యటించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్. తెలంగాణలో రైతులను, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కమిషన్లు కోసమే ప్రాజెక్టులు కట్టే కేసీఆర్...నిర్వహణ కోసం రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను గాలికొదిలేశారని లేఖలో పేర్కొన్నారు. సరస్వతి పంప్‌హౌస్ కారణంగా 500 కోట్ల నష్టం వాటిల్లిందని పునరుద్ధరించాలంటే నాలుగేళ్ల టైం పడుతుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com