REVANTH: రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి వంటి పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులకు అంతర్జాతీయ వర్సిటీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులు చదివేందుకు ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో చేయూతను అందిస్తోంది. ఈ పథకాలు అమల్లోకి వచ్చినప్పటితో పోలిస్తే ఆశావాహుల సంఖ్య రెట్టింపు అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి వంటి పథకాల కల్పతరువుగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిభ ఉండి కూడా ఉన్నత విద్యకు దూరమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్ధులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. వారి జీవితాలకు గేమ్ ఛేంజర్ గా నిలిచే ఇటువంటి పథకాలను ఆదర్శంగా అమలు చేయాలనే ఉద్దేశంతో లబ్దిదారులకు మంజూరు చేసే స్కాలర్షిప్ల సంఖ్యను రెట్టింపు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా విదేశీ వర్సీటిల్లో చదివే తెలంగాణ విద్యార్ధుల సంఖ్య రెట్టింపు కానుంది. ఫలితంగా గతంలో ఈ మూడు పథకాల కింద లబ్ది పొందే విద్యార్ధుల సంఖ్య 1,110 అయితే ప్రజాప్రభుత్వ నిర్ణయంతో ఆ సంఖ్య 1,900కి చేరింది.
పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యా నిధి కింద 300 మంది బీసీ విద్యార్ధులకు మాత్రమే అవకాశం కల్పించే వారు. ఇందులో ఈబీసీల వాటా 15. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను 700కి పెంచింది. ఇందులో 500 బీసీ విద్యార్ధులకు, 200 ఈబీసీ విద్యార్ధులకు కేటాయించారు. అంటే లబ్దిపొందే బీసీ విద్యార్ధుల సంఖ్య దాదాపు 133 శాతం పెరిగింది. ఇప్పటికే బీసీ-సీ, బీసీ-ఈ వర్గాలకు చెందిన 500 మంది విద్యార్ధులు లబ్ది పొందుతున్నారు. వారు కాకుండా ఇప్పుడు బీసీలు 500 మంది లబ్ది పొందుతారు. మొత్తంగా చూస్తే సంవత్సరానికి 1000 మంది బీసీ విద్యార్ధులు లబ్ది పొందుతారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 210 మంది ఎస్సీ విద్యార్ధులకు అవకాశం కల్పించే వారు. ప్రజా ప్రభుత్వం ఈ సంఖ్యను 500కి పెంచింది. అంటే లబ్దిపొందే ఎస్సీ విద్యార్ధుల సంఖ్య దాదాపు 138 శాతం పెరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద గతంలో 100 మంది ఎస్టీ విద్యార్ధులకు అవకాశం కల్పించే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఖ్యను 200కి పెంచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com