REVANTH: ఉస్మానియాలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల హాస్టళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా విద్యార్థుల పోరాటంతోనే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ అన్నారు. ఓ జార్జిరెడ్డి, ఓ గద్దర్ ను అందించిన ఘనత ఉస్మానియాది అని రేవంత్ అన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతోమందిని ఉస్మానియా విశ్వ విద్యాలయం అందించిందని వెల్లడించారు. ఉస్మానియాకు ఎంతో చరిత్ర ఉందన్నారు.
మళ్లీ వస్తా.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా: రేవంత్
ప్రొఫెసర్ కోదండరాంని మరో 15 రోజుల్లో చట్టసభలకు పంపుతామని... ఈసారి ఎవరు అడ్డువస్తారో చూస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటని రేవంత్ నిలదీశారు. తాను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని... అప్పుడు ఒక్క పోలీస్ కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ నిర్వహిస్తానని వెల్లడించారు. విద్యార్థులు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తానని రేవంత్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com