REVANTH: ఇదీ.. రేవంత్ మార్క్ విజయం

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం... ముందుండి నడిపిన సీఎం రేవంత్

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో కాం­గ్రె­స్ వి­జ­యం­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి కీలక పా­త్ర పో­షిం­చా­రు. ఎప్ప­టి­క­ప్పు­డు పక్కా ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కు వె­ళ్లా­రు. అభ్య­ర్థి ఎం­పిక నుం­చి చి­వ­రి రోజు ఓటిం­గ్ రోజు చి­వ­రి గంట వరకు ప్ర­త్యే­కం­గా సమీ­క్షిం­చా­రు. ఎన్నిక ఏదై­నా తాను ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కుం­టా­న­ని ముం­దు చె­ప్పి­న­ట్టు­గా­నే రం­గం­లో­కి ది­గిన రే­వం­త్ పా­ర్టీ­ని ముం­దుం­డి నడి­పిం­చి వి­జ­య­తీ­రా­ల­కు చే­ర్చా­రు. జూ­బ్లీ­‌­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం ఏర్పా­ట­య్యాక మొ­ద­టి, చి­వ­రి­సా­రి 2009లో కాం­గ్రె­స్ పా­ర్టీ గె­లి­చిం­ది. ఆ తర్వాత దా­దా­పు 15 ఏళ్ల తర్వాత వి­జ­యం హస్తం చే­జి­క్కిం­ది. ఇక్కడ పా­ర్టీ కే­డ­ర్ అం­తంత మా­త్రం­గా­నే ఉన్న సమ­యం­లో ఉపఎ­న్నిక రా­వ­డం­తో మొ­ద­ట్లో సర్వే­ల­న్నీ బీ­ఆ­ర్‌­ఎ­స్‌­కే మొ­గ్గు చూ­పా­యి. అం­దు­కే సీఎం ఈ ఉపఎ­న్ని­క­ను మరింత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కు­న్నా­రు. అధి­కా­రం­లో­కి వచ్చి దా­దా­పు రెం­డే­ళ్లు పూ­ర్త­వు­తు­న్న సమ­యం­లో ప్ర­త్య­ర్థి పా­ర్టీల వి­మ­ర్శ­లు, ఆరో­ప­ణ­ల­ను తి­ప్పి­కొ­డు­తూ పక్కా వ్యూ­హ­ర­చ­న­తో సక్సె­స్​అ­య్యా­రు. అభ్య­ర్థి ఎం­పిక నుం­చి పోల్ మే­నే­జ్‌­మెం­ట్ వరకూ అన్ని అం­శా­ల్లో రే­వం­త్ తన­దై­న­శై­లి­లో బా­ధ్య­త­ను భు­జా­ని­కె­త్తు­కు­న్నా­రు. అప్ప­టి­కే బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల అం­శా­న్ని వి­జ­య­వం­తం­గా ప్ర­జ­ల్లో­కి తీ­సు­కె­ళ్లిన ఆయన జూ­బ్లీ­హి­ల్స్‌­లో­నూ బీసీ అభ్య­ర్థి­నే ని­లి­పి ప్ర­త్య­ర్థు­ల­కు సవా­ల్ వి­సి­రా­రు. అజా­రు­ద్దీ­న్‌­కు మం­త్రి పదవి ఇచ్చి చక్రం తి­ప్పా­రు.

ఈ జో­ష్​­తో ఆయా ప్రా­జె­క్టు­ల­ను సీఎం రే­వం­త్​­మ­రింత వే­గం­గా ముం­దు­కు­తీ­సు­కె­ళ్లే అవ­కా­శం ఉం­ద­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్​­లో కాం­గ్రె­స్​­ఘన వి­జ­యం వె­నుక సీఎం రే­వం­త్‌­‌­‌­‌­రె­డ్డి వ్యూ­హా­త్మక ప్ర­ణా­ళిక ఎం­త­గా­నో పని­చే­సిం­ద­ని కాం­గ్రె­స్​ శ్రే­ణు­లు చె­ప్తు­న్నా­యి. మం­త్రి వి­వే­క్​­వెం­క­ట­స్వా­మి­కి జూ­బ్లీ­హి­ల్స్​­ప్ర­చార బా­ధ్య­త­ల­ను జూ­న్​­చి­వ­ర్లో­నే సీఎం రే­వం­త్​ అప్ప­గిం­చా­రు. ఆయన నమ్మ­కా­న్ని ని­ల­బె­డ్తూ.. ని­యో­జ­క­వ­ర్గం­లో గల్లీ­గ­ల్లీ తి­రు­గు­తూ ప్ర­జల సమ­స్య­లు గు­ర్తిం­చి, పరి­ష్క­రిం­చ­డం ద్వా­రా ప్ర­భు­త్వం మీ వెంట ఉం­ద­నే భరో­సా­ను వి­వే­క్​ వెం­క­ట­స్వా­మి కల్పిం­చా­రు. మం­త్రి వి­వే­క్​­కు తో­డు­గా ఆగ­స్టు­లో మరో ఇద్ద­రు మం­త్రు­లు పొ­న్నం ప్ర­భా­క­ర్​, తు­మ్మల నా­గే­శ్వ­ర్​­రా­వు­కు సీఎం రే­వం­త్​­రె­డ్డి ఇన్​­చా­ర్జ్​ బా­ధ్య­త­లు అప్ప­గిం­చ­డం­తో ము­గ్గు­రూ కలి­సి వి­విధ వర్గా­ల­తో వరుస భే­టీ­లు జరు­పు­తూ.. ని­యో­జ­క­వ­ర్గం­లో కాం­గ్రె­స్​ గ్రా­ఫ్​­పెం­చా­రు.

స్థానిక సమరంపై కాంగ్రెస్ గురి

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­కల ఫలి­తా­లు కాం­గ్రె­స్ పా­ర్టీ­కి ఊపి­రి పో­శా­యి. బీ­ఆ­ర్​ఎ­స్​ సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని ఛే­జి­క్కిం­చు­కో­వ­డా­ని­కి రా­ష్ట్ర నా­య­క­త్వం చే­సిన ప్ర­య­త్నా­లు ఫలిం­చా­యి. 3 నె­ల­లు­గా క్షే­త్ర స్థా­యి­లో ము­గ్గు­రు మం­త్రు­లు, పా­ర్టీ నా­య­కు­లు చే­సిన కృషి ఫలి­తం జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­కల వి­జ­యం­గా చె­ప్ప­వ­చ్చు. ఉప ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ వి­జ­య­ప­తా­కా­న్ని ఎగు­ర­వే­య­డం­తో పా­ర్టీ శ్రే­ణు­ల్లో నూతన ఉత్సా­హం నె­ల­కొం­ది. ఇదే ఊపు­తో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు వె­ళ్లే యో­చ­న­లో రా­ష్ట్ర నా­య­క­త్వం ఉంది. జూ­బ్లీ­హి­ల్స్‌­లో కాం­గ్రె­స్ జెం­డా పా­తిం­ది. మూ­డు­సా­ర్లు బీ­ఆ­ర్‌­ఎ­స్‌ గె­లు­పొం­దిన జూ­బ్లీ­హి­ల్స్ స్థా­నా­న్ని హస్తం పా­ర్టీ వశం చే­సు­కుం­ది. సీఎం రే­వం­త్ రె­డ్డి నే­తృ­త్వం­లో, పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­శ్​­కు­మా­ర్ గౌడ్ వ్యూ­హా­ల­కు ప్ర­జా­ను­కూల ఫలి­తం వచ్చిం­ది. ఉప ఎన్నిక ఫలి­తా­న్ని ఆ పా­ర్టీ చా­రి­త్రా­త్మక వి­జ­యం­గా పరి­గ­ణి­స్తోం­ది. రా­ష్ట్రం­లో ప్ర­జా­భి­మా­నా­న్ని ప్ర­తి­బిం­భి­స్తోం­ద­ని పీ­సీ­సీ వర్గా­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­యి.

Tags

Next Story