REVANTH: ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది

REVANTH: ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది
X
జూబ్లీహిల్స్ ప్రజా తీర్పుపై రేవంత్ హర్షం.. నియోజకవర్గ ఓటర్లకు సీఎం ధన్యవాదాలు

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్నిల ఫలి­తా­ల­పై ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి స్పం­దిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌­లో గె­లు­పు కోసం కృషి చే­సిన అం­ద­రి­కీ రే­వం­త్ కృ­త­జ్ఞ­త­లు చె­ప్పా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గ ప్ర­జ­లు, ఓట­ర్ల­కు ధన్య­వా­దా­లు చె­ప్పా­రు. ఈ వి­జ­యం తమ బా­ధ్య­త­ను మరింత పెం­చిం­ద­ని సీఎం రే­వం­త్ అభి­ప్రా­య­ప­డ్డా­రు. 2023 అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో గ్రే­ట­ర్‌ హై­ద­రా­బా­ద్‌­లో కాం­గ్రె­స్‌­కు సరైన ఫలి­తా­లు రా­లే­దు.. అసెం­బ్లీ ఎన్ని­కల ఫలి­తాల తర్వాత హై­ద­రా­బా­ద్ ప్ర­జ­ల­కు కాం­గ్రె­స్‌­పై క్ర­మం­గా నమ్మ­కం పె­రు­గు­తోం­ద­ని అన్నా­రు. గె­లు­పో­ట­ము­ల­కు కాం­గ్రె­స్ ఎప్పు­డూ కుం­గి­పో­దు.. పొం­గి­పో­దు అని చె­ప్పా­రు. ప్ర­జల తర­పున ని­ల­బ­డ­టం, పో­రా­డ­ట­మే కాం­గ్రె­స్‌ కర్త­వ్యం అని అన్నా­రు. రా­ష్ట్రం­లో రెం­డే­ళ్ల కాం­గ్రె­స్‌ పా­ల­న­ను ప్ర­జ­లు ని­శి­తం­గా పరి­శీ­లిం­చి.. జూ­బ్లీ­హి­ల్స్‌­లో తీ­ర్పు ఇచ్చా­ర­ని తె­లి­పా­రు. ఇప్ప­టి­కై­నా బీ­ఆ­ర్ఎ­స్, బీ­జే­పీ నే­త­లు అర్థం చే­సు­కొ­ని ప్ర­భు­త్వా­ని­కి సహ­క­రిం­చా­ల­ని కో­రా­రు. రా­ష్ట్ర ఆదా­యం­లో 65 శాతం వరకు హై­ద­రా­బా­ద్ నుం­చే వస్తోం­ద­ని.. హై­ద­రా­బా­ద్ అభి­వృ­ద్ధి కోసం ఎవరి పా­త్ర వా­ళ్లం పో­షి­ద్దా­మ­ని పి­లు­పు­ని­చ్చా­రు. కాం­గ్రె­స్‌ వి­జ­యం­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి వ్యూ­హా­త్మ­కం­గా వ్య­వ­హ­రిం­చా­రు. అభ్య­ర్థి ఎం­పిక నుం­చి ప్ర­చా­రం వరకు దగ్గ­రుం­డి పర్య­వే­క్షిం­చా­రు. మై­నా­ర్టీ­ల్లో మరింత పట్టు­కో­సం పో­లిం­గ్‌­కు కొ­ద్ది­రో­జుల ముం­దే అజా­రు­ద్దీ­న్‌­కు మం­త్రి పదవి కట్ట­బె­ట్టా­రు.

కాంగ్రెస్‌ కర్తవ్యం పోరాటం

”ప్ర­జల తర­పున ని­ల­బ­డ­టం, పో­రా­డ­ట­మే కాం­గ్రె­స్ కర్త­వ్యం. రెం­డే­ళ్ల పా­ల­న­ను ప్ర­జ­లు ని­శి­తం­గా పరి­శీ­లిం­చి తీ­ర్పు ఇచ్చా­రు. రా­ష్ట్ర ఆదా­యం­లో 65శాతం వరకు జంట నగ­రాల నుం­చే వస్తోం­ది. ఈ నగ­రాల ఆదా­యా­న్నే రా­ష్ట్రం­లో అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­కు వా­డు­తు­న్నాం. హై­ద­రా­బా­ద్ నగ­రా­ని­కి ఉన్న ప్రా­ధా­న్యత దృ­ష్ట్యా మరింత అభి­వృ­ద్ధి చే­స్తాం. 2023 ఎల­క్ష­న్ తర్వాత నుం­చి ఎన్ని­క­లు వచ్చి­న­ప్పు­డ­ల్లా ఓట్ల శాతం పె­రు­గు­తోం­ది. జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­లో వి­జ­యం­తో కాం­గ్రె­స్ కు బలం పె­రి­గిం­ది. సో­ష­ల్ మీ­డి­యా­లో వి­ష­ప్ర­చా­రం చే­శా­ర­ని రే­వం­త్ అన్నా­రు. ప్ర­తి­ప­క్ష నా­య­కు­లు అభి­వృ­ద్ధి­ని అడ్డు­కుం­టు­న్నా­రు. హరీ­శ్ రావు అసూయ, కే­టీ­ఆ­ర్ అహం­కా­రం తగ్గిం­చు­కో­వా­లి. అధి­కా­రం ఎవ­రి­కీ శా­శ్వ­తం కా­ద­న్నా­రు. హై­డ్రా, ఈగల్ వంటి సం­స్థ­లు హై­ద­రా­బా­ద్ అభి­వృ­ద్ధి కో­స­మే తె­చ్చి­న­ట్లు తె­లి­పా­రు. కానీ వా­టి­పై­నే బీ­ఆ­ర్ఎ­స్ దృ­ష్టి పె­ట్టి మరీ తప్పు­డు ప్ర­చా­రం చే­సిం­ది.. ప్ర­జ­లు వా­స్త­వా­న్ని గు­ర్తిం­చి ఓటు వే­శా­ర­ని అన్నా­రు. సో­ష­ల్ మీ­డి­యా­లో విష ప్ర­చా­రం చే­య­డం ఇక­నై­నా బీ­ఆ­ర్ఎ­స్ నే­త­లు ఆపా­ల­ని అన్నా­రు.

సంక్షేమానికి పట్టం కట్టారు: టీపీసీసీ చీఫ్‌

జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్ని­క­లో కాం­గ్రె­స్‌ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. 25 వే­ల­కు­పై­గా ఓట్ల మె­జా­ర్టీ­తో ఆ పా­ర్టీ అభ్య­ర్థి నవీ­న్‌ యా­ద­వ్‌ జయ­కే­త­నం ఎగ­ర­వే­శా­రు. ఈ నే­ప­థ్యం­లో టీ­పీ­సీ­సీ అధ్య­క్షు­డు మహే­శ్‌­కు­మా­ర్‌ గౌ­డ్‌ ని­జా­మా­బా­ద్‌­లో మీ­డి­యా­తో మా­ట్లా­డా­రు. ‘‘జూ­బ్లీ­హి­ల్స్‌ ప్ర­జ­లు అభి­వృ­ద్ధి, సం­క్షే­మా­ని­కి పట్టం కట్టా­రు. ఈ వి­జ­యం కష్ట­ప­డిన ప్ర­తి కా­ర్య­క­ర్త­కు అం­కి­తం. జూ­బ్లీ­హి­ల్స్‌ తీ­ర్పు­తో ప్ర­జ­లు BRS పా­ర్టీ­కి సె­ల­వు ప్ర­క­టిం­చా­రు. రా­ష్ట్రం­లో ఆ పా­ర్టీ­కి చో­టు­లే­ద­ని మరో­సా­రి రు­జు­వైం­ది. రా­ను­న్న రో­జు­ల్లో­నూ ప్ర­జల ఆకాం­క్ష­ల­కు అను­గు­ణం­గా ప్ర­జా­పా­లన కొ­న­సా­గు­తుం­ది. నవీ­న్‌­ను గె­లి­పిం­చిన ఘనత.. సీఎం, మం­త్రు­లు, ప్ర­తి కాం­గ్రె­స్‌ కా­ర్య­క­ర్త­ది’’ అని మహే­శ్‌­కు­మా­ర్‌ గౌ­డ్‌ అన్నా­రు.

Tags

Next Story