REVANTH: రెండేండ్లలో ఉస్మా"నయా": సీఎం రేవంత్

REVANTH: రెండేండ్లలో ఉస్మానయా: సీఎం రేవంత్
X
వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా.. రెండేళ్లలో కొత్త భవన నిర్మాణ పనులు పూర్తవ్వాలి.. వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ

హై­ద­రా­బా­ద్‌­లో ఉస్మా­ని­యా ఆసు­ప­త్రి నూ­త­‌న భవన ని­ర్మా­ణం రెం­డే­ళ్ల­లో పూ­ర్తి చే­యా­ల­‌­ని తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ఆదే­శిం­చా­రు. ఉస్మా­ని­యా నూ­త­‌న ఆసు­ప­‌­త్రి ని­ర్మా­ణం­పై సీఎం రే­వం­త్ రె­డ్డి ఉన్న­త­స్థా­యి సమా­వే­శం­లో సమీ­క్షిం­చా­రు. ఆస్ప­త్రి ని­ర్మా­ణా­న్ని రా­ష్ట్ర ప్ర­‌­భు­త్వం ప్ర­‌­తి­ష్టా­త్మ­‌­కం­గా భా­వి­స్తుం­ద­ని చె­ప్పా­రు. రా­బో­యే 100 సం­వ­త్స­రాల అవ­స­రా­ల­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని ఆస్ప­త్రి ని­ర్మా­ణం, సౌ­క­ర్యా­ల­ను ప్లా­న్ చే­యా­ల­ని తె­లి­పా­రు. అధు­నా­తన పరి­క­రాల ఏర్పా­టు­కు తగి­న­ట్లు గదు­లు, ల్యా­బ్లు, ఇతర ని­ర్మా­ణ­లు ఉం­డా­ల­ని ఇం­జి­నీ­రిం­గ్ అధి­కా­రు­ల­కు ము­ఖ్య­మం­త్రి సూ­చిం­చా­రు. ఆసు­ప­త్రి ని­ర్మాణ పను­ల­తో పాటు స్థా­ని­కు­ల­కు ఇబ్బం­ది లే­కుం­డా చు­ట్టూ రో­డ్ల ని­ర్మా­ణం చే­ప­ట్టా­ల­న్నా­రు. ఆసు­ప­త్రి ని­ర్మాణ పను­లు వే­గ­వం­తా­ని­కి వై­ద్యా­రో­గ్య శాఖ, పో­లీ­సు, జీ హె­చ్ఎం­సీ, ఆర్ అండ్ బీ, వి­ద్యు­త్ శాఖ అధి­కా­రు­ల­తో సమ­న్వయ కమి­టీ­ని వెం­ట­నే ఏర్పా­టు చే­యా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. ఈ కమి­టీ క్షే­త్ర స్థా­యి­లో పర్య­టి­స్తూ ప్ర­తి పది రో­జు­ల­కో­క­సా­రి సమా­వే­శ­మై ఏవై­నా సమ­స్య­లుం­టే పరి­ష్క­రిం­చు­కుం­టూ పను­లు వే­గం­గా జరి­గే­లా చూ­డా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు. ప్ర­తి 15 రో­జు­ల­కు ఒక­సా­రి ని­ర్మాణ సమీ­క్ష చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు ము­ఖ్య­మం­త్రి సూ­చ­న­లు చే­శా­రు.

స్థానికులకు ఇబ్బందులు లేకుండా...

స్థా­ని­కు­ల­కు ఇబ్బం­ది లే­కుం­డా రో­డ్ల ని­ర్మా­ణం చే­ప­ట్టా­ల­ని ఆదే­శా­లు జారీ చే­శా­రు. హై­ద­రా­బా­ద్‌­తో పాటు జి­ల్లా­ల్లో­నూ ఆసు­ప­త్రుల పనుల పర్య­వే­క్ష­ణ­కు అధి­కా­రుల ని­యా­మ­కం జరి­గిం­ద­న్నా­రు. వచ్చే జూన్ నా­టి­కి అన్ని మె­డి­క­ల్ కళా­శా­ల­లు, ఆసు­ప­త్రుల పను­లు పూ­ర్తి చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు. అలా­గే ట్రా­ఫి­క్, భద్ర­తా ప్ర­ణా­ళి­క­ల­ను ముం­దు­గా­నే సి­ద్ధం చే­యా­ల­ని పో­లీ­సు­ల­కు ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి సూ­చిం­చా­రు. ఈ సమా­వే­శా­ని­కి సీఎం ప్రి­న్సి­ప­ల్ సె­క్ర­ట­రీ­లు శ్రీ­ని­వా­స­రా­జు, శే­షా­ద్రి, సె­క్ర­ట­రీ మా­ణి­క్ రాజ్, హె­ల్త్ సె­క్ర­ట­రీ క్రి­స్టి­నా, ఆర్ అండ్ బీ స్పె­ష­ల్ సీ­ఎ­స్ వి­కా­స్ రాజ్, ఎంఏ అండ్ యూడీ సె­క్ర­ట­రీ ఇలం­బ­ర్తి, డీ­జీ­పీ శి­వ­ధ­ర్ రె­డ్డి, హై­ద­రా­బా­ద్ కలె­క్ట­ర్ హరి­చం­దన, ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­ర­య్యా­రు. ఉస్మా­ని­యా నూతన ఆసు­ప­త్రి పూ­ర్త­య్యాక అక్కడ రక్షణ, ట్రా­ఫి­క్ ని­ర్వ­హణ వంటి అం­శా­ల­పై ముం­ద­స్తు­గా ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­యా­ల­ని రే­వం­త్ పో­లీ­సు ఉన్న­తా­ధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ఆసు­ప­త్రి­ని ప్ర­ధాన రహ­దా­రు­ల­తో అను­సం­ధా­నిం­చే రహ­దా­రి ప్ర­ణా­ళి­క­ల­ను సి­ద్ధం చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు.

పర్యవేక్షకులను నియమించాలన్న సీఎం

హై­ద­‌­రా­బా­ద్‌­తో పాటు వి­విధ జి­ల్లా­ల్లో ని­ర్మా­ణం­లో ఉన్న ఆసు­ప­‌­త్రు­లు, మె­డి­క­‌­ల్ క‌­ళా­శా­ల­‌ల ని­ర్మా­ణా­ని­కి సం­బం­ధిం­చి ప్ర­‌­తి ని­ర్మా­ణా­ని­కి ఒక అధి­కా­రి­ని ప్ర­త్యే­కం­గా ని­య­‌­మిం­చా­ల­‌­ని రే­వం­త్ ఆదే­శిం­చా­రు. ని­ర్మా­ణా­ల­‌­పై 24x7 ఆ అధి­కా­రి ప‌­ర్య­‌­వే­క్షిం­చే­లా పూ­ర్తి­స్థా­యి బా­ధ్య­త­ల­ను అప్ప­గిం­చా­ల­ని చె­ప్పా­రు. వచ్చే జూన్ నా­టి­కి ని­ర్మా­ణా­లు పూ­ర్తి చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు. హై­ద­రా­బా­ద్లో పాటు వి­విధ జి­ల్లా­ల్లో ని­ర్మా­ణం­లో ఉన్న దవా­ఖా­న­లు, మె­డి­క­ల్ కళా­శా­లల పర్య వే­క్ష­ణ­కు అధి­కా­రు­ల­ను ని­య­మిం­చా అని ఆదే­శిం­చా­రు.

Tags

Next Story