REVANTH: ఏం చేశారని ఓట్లు అడుగుతారు

REVANTH: ఏం చేశారని ఓట్లు అడుగుతారు
X
జూబ్లీహిల్స్‌లో రేవంత్ ప్రచారం.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు

తెలంగాణ, జూబ్లీహిల్స్‎కు ఏం చేశారని బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే నమ్మకం ఉందని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని.. అవకాశం అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చన్నారు. అవకాశం వస్తే మన కోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలని.. మనకోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోకపోతే చారిత్రక తప్పిదమే అవుతుందని అన్నారు.

బీఆర్ఎస్ సచ్చిపోయి,,,

త పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సచ్చిపోయి బీజేపీని గెలిపించిందని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేసి తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమన్నారు. బీఆర్ఎస్‎తో కలిసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.

ఆర్థిక సాయానికి ప్రణాళికలు

వర­ద­లు తగ్గిన నే­ప­థ్యం­లో శా­ని­టే­ష­న్ ప్ర­క్రి­య­ను వే­గ­వం­తం చే­యా­ల­ని రే­వం­త్ ఆదే­శిం­చా­రు. వర­ద­ల్లో ప్రాణ నష్టం జరి­గి­న­చోట రూ.5 లక్ష­లు పరి­హా­రా­ని­కి ప్ర­భు­త్వం సి­ద్ధం­గా ఉం­ద­న్నా­రు. ఇం­దు­కు సం­బ­ధిం­చి వి­వ­రా­లు సే­క­రిం­చా­ల­ని.. పం­ట­న­ష్టం, పశు సంపద నష్ట­పో­యిన చోట వా­రి­కి పరి­హా­రం అం­దిం­చా­ల­న్నా­రు. ఇసుక మే­ట­లు పే­రు­కు­న్న రై­తు­ల­ను ఆదు­కు­నేం­దు­కు చర్య­లు తీ­సు­కో­వా­ల­న్నా­రు. "ఇం­డ్లు ము­ని­గిన వా­రి­కి ప్ర­తీ ఇం­టి­కి రూ.15 వేలు..ఎకరా పంట నష్టా­ని­కి రూ.10వేలు ఇచ్చేం­దు­కు ప్ర­ణా­ళి­క­లు సి­ద్దం చే­యా­లి. ఇం­ది­ర­మ్మ ఇం­డ్లు ఇచ్చే అం­శా­న్ని పరి­శీ­లిం­చా­లి. ము­న్సి­ప­ల్, ఇరి­గే­ష­న్ అధి­కా­రు­లు సమ­న్వ­యం­తో పని­చే­యా­లి. స్మా­ర్ట్ సి­టీ­లో చే­యా­ల్సిన పను­ల­పై ప్ర­త్యేక ని­వే­దిక తయా­రు చే­యా­లి. ఎక్క­డా పను­లు ఆపే ప్ర­స­క్తి ఉం­డొ­ద్దు. క్షే­త్ర­స్థా­యి­లో ఒక కో-ఆర్డి­నే­ష­న్ కమి­టీ వే­సు­కు­ని పని­చే­యా­లి. అధి­కా­రు­లు ని­ర్ల­క్ష్యం వద­లం­డి క్షే­త్ర­స్థా­యి­కి వె­ళ్లం­డి.. కలె­క్ట­ర్లు కూడా ఫీ­ల్డ్ వి­జి­ట్స్ చే­యా­ల్సిం­దే అని సీఎం రే­వం­త్ రె­డ్డి ఆదే­శిం­చా­రు.

Tags

Next Story