REVANTH: ఇచ్చిన మాట కోసం ఎన్నో త్యాగాలు చేశాం

తెలంగాణలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా రంగాలను వారు ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్... అభివృద్ధి, ప్రతిపక్షాల విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. "నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పునాది వేసిన ఐటీ రంగం నగర అభివృద్ధికి కీలకంగా మారింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయి.” అని రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మారిందంటే.. అందుకు కారణం చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ పాలన సాగిందని, తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని కాంగ్రెస్ సర్కార్ నిరూపించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రపంచాన్నే శాసించే సంస్థలు ఇక్కడే
కాంగ్రెస్ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయని రేవంత్ గుర్తు చేశారు. "దేశానికి వచ్చిన వాటిలో 70 శాతం ఇక్కడికే వచ్చాయి. ప్రపంచాన్నే శాసించే సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. నగరం నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలే కారణం. అభివృద్ధి మాత్రమే కాదు.. సంక్షేమంలోనూ వారు తమదైన ముద్ర వేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాయి’’ అని రేవంత్ అన్నారు. తలకాయలో గుజ్జు ఉన్న వారు.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం పైశాచిక ఆనందం.. వెకిలి చేష్టలు ఎక్కువ అయ్యాయి.. అంత అసహనం ఎందుకు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
డ్రగ్స్ కల్చర్ ఎవరిది..?
“ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ఇవాళ గల్లి గల్లి డ్రగ్స్.. గంజాయి దందాలు ఉన్నాయి. ఎవరు సినీ కార్మికులతో ఉన్నారు.. సినీ తారలతో చర్చల్లో ఉన్నది ఎవరో ఆలోచించండి.. గ్రేటర్ లో నాకు ప్రతినిధులు లేరు.. ఓల్డ్ సిటీలో సహకరించే వారికి అభివృద్ధి నిధులు ఇస్తున్న.. కంటోన్మెంట్ లో మేము గెలిచిన.. నిధులు అభివృద్ధి జరుగుతుంది.. BRS MLAలు ఇప్పటి వరకు సమస్యలపై నా దగ్గరికి రాలేదు.. మేము పోవాలి అంటే.. ప్రోటోకాల్ మాది.. మీరెందుకు వస్తున్నారు అంటున్నారు.. BRS గెలిచిన వాళ్ళే సభకు రావడం లేదు.. జూబ్లిహిల్స్ లో గెలిచి ఏం చేస్తారు.. పదేళ్లు మేము అధికారంలో ఉంటాం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం డ్రగ్స్, చెరువుల ఆక్రమణలు తొలగిస్తాం..” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సెంటిమెంటా..డెవలప్ మెంటా తేల్చుకోవాని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలిచినందునే అక్కడ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనతో కాంగ్రెస్ పాలనను పోల్చవద్దన్నారు. ఎవరిది అగ్రికల్చర్.. ఎవరిది డ్రగ్స్ కల్చర్..ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది ప్రజలతో కలిసిపోయే కల్చర్ అన్నది ఆలోచించాలని.. సినీ కార్మికులతో ఎవరున్నారు? సినీ తారలతో ఎవరున్నారో ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
