REVANTH: దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తాం

దేశానికి కాంగ్రెస్ సర్కార్.. ఫ్యూచర్ సిటీని అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అభివృద్ధిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇండస్ట్రియల్ పార్కు, ‘మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ’ తయారీ యూనిట్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ‘‘పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. హైదరాబాద్‌కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదు.. ప్రపంచ నగరాలతోనే పోటీ. రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్-2047 ప్రణాళికను రూపొందించుకున్నాం. నగర అభివృద్ధి కోసం దేశ, విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయి. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నాం’’అని సీఎం తెలిపారు.
ప్రపంచ నగరాలతోనే హైదరాబాద్‌కు పోటీ
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందని రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరానికి దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదన్నారు. ప్రపంచ నగరాలతోనే పోటీ అని సీఎం అభివర్ణించారు. రానున్న 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్-2047 ప్రణాళికను రూపొందించుకున్నామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం దేశ, విదేశాలకు చెందిన కన్సల్టెంట్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా అనీ, పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని తెలిపారు.
తయారీ రంగంలో ఎక్కువగా అభివృద్ధి
అంతకుముందు మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణలో తయారీ రంగం(మాన్యుఫ్యాక్చరింగ్) అభివృద్ధి ఎక్కువగా ఉందని 9 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని వివరించారు. గ్రీన్ ఇండస్ట్రియల్, నూతన ఎంఎస్ఎంఈ పాలసీ-2025ను ప్రభుత్వం ఆమోదించిందని శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీల ఏర్పాటుకు 4,200 దరఖాస్తులు వచ్చాయని వచ్చాయని మంత్రి వెల్లడించారు. 15 రోజుల్లోనే 98 శాతం దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా, వేగంగా అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా అందుకున్నారని ఆనందించారు. డ్రగ్స్, నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ముందున్నారని, సైబర్ నేరాల నివారణ, సొమ్ము రికవరీలో తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్‌వన్ అని సంతోషించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com