REVANTH: ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటా..?

తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుట్ర వల్లే తెలంగాణలో నేడు టీడీపీ మనుగడలో లేకుండా పోయిందని చెప్పారు. ప్రకృతి అనేది ఉంటుందని, అది తప్పకుండా శిక్షిస్తుందని హెచ్చరించారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాగించలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు. హరీశ్, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అలాంటి చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానని తనకు అంత సమయం లేదని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పరిణామాలపై వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారన్నారని విమర్శించారు. పాలమూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. మూసాపేట మండలం వేములపల్లిలో ఫార్మా కంపెనీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ సూటిగానే బీఆర్ఎస్ అధినేత ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని బతకనివ్వబోమని ఆనాడు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని అన్నారు. ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారన్నారని తేల్చేశారు.
నేను ముందే ఉంటా..
అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదన్నారు. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయని.. కచ్చితంగా అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు ..అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాననని ప్రశ్నించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా… నా వాళ్లకు తోడుగా ఉంటానని ప్రకటించారు. వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే… లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నేతలు వాళ్లల్లో వాళ్లే విమర్శించుకుంటున్నారని.. దానికి కాంగ్రెస్తో ఏం సంబంధమని ప్రశ్నించారు.
ఇప్పటికే ప్రజలు బండకేసి కొట్టారు..
కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడో ప్రజలు బండకేసి కొట్టారని, ఇన్నాళ్లూ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నారని బీఆర్ఎస్ ఇంటి పోరుపై రేవంత్ స్పందించారు. గతంలో ఎవరినీ ఎదగనీయని వాళ్లు ఇప్పుడు వాళ్లలో వాళ్లే పంచాయతీ పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారని.. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా అని ప్రశ్నించారు. దయచేసి మీ కుటుంబ పంచాయతీలోకో.. మీ కుల పంచాయతీలోకో మమ్మల్ని లాగవద్దని హెచ్చరించారు. మాకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారన్నారు. మీది కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ అని కాలగర్భంలో కలిసిపోతుందని స్పష్టం చేశారు. ప్రకృతి ఉంటుంది..ప్రకృతి శిక్షిస్తుందని స్పష్టం చేశారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడంలో తలెత్తిన విభేదాలే వారి మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.
టీడీపీ కనుమరుగుకు కారణం కాదా..?
నాకు కల్వకుంట్ల కుటుంబ వివాదాల వెనుక ఉండే అంత సమయంలేదని… ఇంత పనికిమానోళ్ల వెనుక నేనెందుకు ఉంటానన్నానని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జరుగుతున్న పరిణమాలు అందరికి తెలుసు..మీ వివాదంలోకి మీ కుటుంబ, కుల పంచాయతీలలోకి మమ్మల్ని లాగకండని హితవు పలికారు. మీ కుటుంబ పంచాయతీపై మాకు ఎలాంటి ఆసక్తి లేదని..మీమ్మిల్ని ఎప్పడో ప్రజలు తిరస్కరించారని కల్వకుంట్ల కుటుంబానికి స్పష్టం చేశారు. మీరు కాలం చెల్లిన 1000నోటు లాంటోళ్లు..కాల గర్బంలో ఆ పార్టీ కలిసిపోతుందన్నారు. దేశంలో జనతా పార్టీ, తెలంగాణలో టీడీపీ వంటి పార్టీలే కనుమరుగయ్యాయని.. ఇన్ని దుర్మార్గులు చేసిన మీరు మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పృకృతి అనేది ఉంటుంది..అది శిక్షస్తుంది..అందులో మనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఒకప్పుడు ఏ పార్టీని బతుకనివ్వం..ఎవరిని ఎమ్మెల్యేలను కానివ్వమని గతంలో అక్రమ కేసులు పెట్టి ఎందరినో జైళ్లకు పంపించినోళ్లు..ఇప్పుడు వాళ్లలో వాళ్లే తన్నుకోని చస్తున్నారని కేసీఆర్ కుటుంబంలోని పరిణామాలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాపాలు ఎక్కడి పోవు..ఖచ్చింతగా వెంటాడుతుంటాయి.. వాళ్లు అనుభవించాల్సిందేనన్నారు. రాజకీయాలవైపు చూడకుండా పాలమూరు జిల్లాను అభివృద్ది చేసుకుందామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com