REVANTH: తెలంగాణలో రేవంత్ మార్క్ కనిపించేనా..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లకు వచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల్లో తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు తన ప్రసంగాలతో ఒక్కసారిగా క్రేజ్ పెంచుకొని అధికారం చేపట్టిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక మాత్రం డీలా పడినట్లే కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో అమలు చేయలేని అడ్డగోలు హామీలిచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి పాలన అట్టర్‌ప్లాప్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు కల్పించినప్పటికీ.. బస్సులో ఎక్కిన మహిళలు జట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి తెచ్చాడు. సోషల్ మీడియాలో మహిళలు కొట్టుకున్న వీడియోలు ఒకటి కాదు... రెండు కాదు.. పదుల్లో వైరల్ అవుతున్నాయి. మహిళలకు బస్సులో ప్రత్యేక సీట్లు కేటాయించడం పక్కన పెడితే.. కనీసం మర్యాద కూడా ఇవ్వటం లేదని రేవంత్ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. బస్సు చార్జీలు తీసుకుంటేనే మాకు తమకు బస్సులలో గౌరవం ఇస్తున్నారని.. ఫ్రీ బస్సులో ఉచితంగా ప్రయాణించడం వల్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్సు ఇచ్చినట్లే ఇచ్చి పురుషులకు మాత్రం టికెట్టు ధరలు పెంచింది. ఫ్రీ బస్సు మాకొద్దు మహప్రభో అంటూ మహిళలు మొరపెట్టుకుంటున్నారు.
జాడ లేని ప్రజాపాలన దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలులో భాగంగా ప్రజపాలన దరఖాస్తులు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి సారి చేసిన ప్రజాపాలన దరఖాస్తుల జాడనే దొరకడంలేదు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు ఊసే ఎత్తడం లేదు. కొత్త రేషన్ కార్డులు కొన్ని జారీ చేసినా అందులో పేర్ల నమోదు తప్పుల తడకగా ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త రేషన్‌కార్డుల జాడ కనుచూపు మేరలో కూడా కానరాక.. ఎప్పుడొస్తాయో కూడా తెలియక నిరుపేదలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. 2023 డిసెంబర్లో అధికారం చేపట్టాక తొలుత ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత గ్రామ, వార్డుసభలు నిర్వహించి రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు స్వీకరించారు. ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో అర్జీ పెట్టుకోవాలని సూచించారు. ఒక్క రేషన్‌కార్డు కోసం ఒక్కో వ్యక్తి మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో విచారణ కూడా చేశారు. కొత్త రేషన్‌కార్డు వస్తేనే ఇంటి అవసరాల కోసం వినియోగించే ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ గ్యాస్, ఇతర సంక్షేమ పథకాలకు అర్హులు అవుతారు. ప్రభు త్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి చేయడం తో ఇప్పటివరకు కార్డు లేని వారికి పథకాలు రాకుండా పోతున్నాయి. రేషన్‌కార్డులు ఇస్తే మళ్లీ పథకాలకు దరఖాస్తులు వస్తాయి.
అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
ఇళ్లు లేని నిరుపేదలందరికీ సొంతిల్లు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదరికం రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఈ పథకానికి అర్హులు. పంచాయితీ ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్లాన్ ఒక్కో పథకాన్ని అములు చేస్తుంటే.. లోకల్ లీడర్లు మాత్రం పథకాల పేరుతో పైసలు వసూల్ చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే అధిష్టానం అప్లీకేషన్లు పెట్టుకున్న కొందరి పేర్లు జాబితాలో రాకపోవడంతో రేవంత్ సర్కార్‌పై తీవ్రంగా వ్యతిరేత మొదలైంది. జాబితాలో పేర్లు వచ్చినా ప్రభుత్వం పెట్టే కండీషన్స్‌కు ప్రజలు ఒప్పుకోవడం లేదు.
భవిష్యత్ కోసం నిర్ణయాలు
మరోవైపు రేవంత్ సంక్షేమ పథకాలు అమలుపైనా దృష్టి పెడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లోనూ రేవంత్ ముందు వరుసలో నిలిచారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు, రూ. 500 వంట గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. హైదరాబాద్ లో కాలు ష్యం తగ్గించేందుకు నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి..వాటి స్థానంలో 3,000 ప్లస్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నారు. మహిళలకు రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అండగా నిలుస్తున్నారు. కోటి మంది మహిళా కోటీశ్వరులను సృష్టించేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలను..మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రలో సర్వే నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి అభ్యున్నతి దిశగా అడగులు వేస్తున్నారు. రెసిడెన్షియన్ పాఠశాలల నిర్వ హణ లో సంస్కరణలు ప్రవేశ పెట్టారు. దళిత, గిరిజన, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com