REVANTH: దళితుడు స్పీకర్‌గా ఉంటే అసెంబ్లీకి రారా..?

రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ నిరూపిస్తే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుపొచ్చవచ్చని నిరూపించింది డా.బిఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడపవచ్చని చెప్పిన మార్గదర్శి, ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు. ఈ దేశానికి రెండు కళ్లలో ఒకటి మహాత్మగాంధీ అయితే మరో కన్ను డా.బిఆర్ అంబేద్కర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం దళితులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ వంటి నాయకులకు కీలక పదవులు ఇచ్చి ఈ విషయాన్ని నిరూపించారు. ఇలాంటి నిర్ణయాలు దళిత సమాజంలో నమ్మకం పెంచాయి. హైదరాబాద్‌లోని దళిత కాలనీల్లో నివసించే ప్రజలు ఇప్పుడు తమ ప్రతినిధులు ప్రభుత్వంలో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు. భట్టి విక్రమార్క దళిత నాయకుడిగా ప్రజల మధ్య మంచి ఆదరణ పొందుతున్నారు. వారి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణ గ్రామాల్లోని సామాన్యులకు మేలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.
“స్పీకర్‌ని అధ్యక్షా అని పిలవడం కూడా ఇష్టం లేని కొంతమంది సభకు రావట్లేదు. ఇది దళితుల్ని అవమానించడమే” అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రతిబింబిస్తాయి. దళిత నాయకుడైన స్పీకర్‌కు గౌరవం ఇవ్వడం సామాజిక న్యాయానికి అవసరమని సీఎం అన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి పదేళ్లలో ఉద్యమంలో ముందున్న వారి పరిస్థితి ఎలా ఉంది? గద్దర్, అందెశ్రీ లాంటి వారి పరిస్థితి ఎలా ఉందని ఆలోచించాలన్నారు. గత పాలకులు ఎన్నికల్లో ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ మంత్రివర్గంలో దళితులు, గిరిజనులకు వారిచ్చిన ఇచ్చిన స్థానం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఆనాడు మంత్రి వర్గంలో ఏ జాతికి ఎంత స్థానం ఉంది? ఈనాడు మంత్రి వర్గంలో ఎంత స్థానం ఉందో మీరే లెక్క చెప్పాలన్నారు. ఒక స్పీకర్‌తో పాటు నలుగురు మంత్రులు, విప్లలో దళితులు, గిరిజనులకు ఇంతటి ప్రాతినిథ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా దక్కలేదన్నారు. భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్‌గా ఉంటే ఓర్వలేక అవమానకర రీతిలో అతడిని తొలగించిన చరిత్ర మన కళ్లముందే ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
