REVANTH: ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం

REVANTH: ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
నిరుద్యోగులు నా కుటుంబ సభ్యులు... స్పష్టం చేసిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయన్న రేవంత్‌రెడ్డి... ఐటీఐ ల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయన్నారు. 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులన తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాననన రేవంత్‌రెడ్డి...తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని అన్నారు. తాము పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన తమకు లేదన్న రేవంత్‌రెడ్డి తాము ప్రజలకు సేవకులం అన్నారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారన్న తెలంగాణ ముఖ్యమంత్రి.. సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలన్నారు.


సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతున్నానని... కేవలం సర్టిఫికెట్స్‌ జీవన ప్రమాణాలను పెంచవన్నారు. దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుందన్నారు. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీలు గా మారుస్తున్నామన్నారు. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగు వారు పోటీ పడుతున్నారన్న ఆయన... మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అని అన్నారు. తెలంగాణలోని 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలని సూచించారు. ఈ శాఖ తన దగ్గరే ఉంటుందని.... తానే పర్యవేక్షిస్తానని.. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. తాము పాలకులం కాదని ప్రజల సంక్షేమం కోసమే తీవ్రంగా కృషి చేస్తున్నట్లు రేవంత్‌ తెలిపారు. యువతీ యువకులు నైపుణ్యాలు పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు.

Tags

Next Story